అక్కడ ఏం జరిగింది : శ్రీధరణిని చంపింది ప్రియుడేనా!

పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో ఆదివారం ప్రేమజంటపై జరిగిన దాడి వ్యవహారం కీలక మలుపు తీసుకుంటుంది. భీమడోలు మండలానికి చెందిన నవీన్ (19), శ్రీధరణి (18) బౌద్ధారామాలు చూడడానికి వెళ్లగా యువతి హత్యకు గురై నవీన్ తీవ్రగాయాలపాలయ్యాడు. అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈక్రమంలో ప్రియుడే ప్రియురాలిని హత్య చేశాడా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రియుడు చెబుతున్న సమాధానాలు అనుమానం కలిగించేలా ఉన్నాయంటూ ప్రియుడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: అమర జవాన్ భార్య శపథం : నేను సైన్యంలో చేరుతున్నాను..
యువతి తలపై దుడ్డుకర్రతో బలంగా మోదడం వల్లనే మృతి చెందినట్లు చెబుతున్నారు. ఆమెపై అత్యాచారం కూడా జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవీన్ వ్యవహార తీరు కూడా అనుమానించదగినదిగా ఉందని పోలీసులు చెప్తున్నారు. దర్యాప్తులో కూడా ప్రియుడు పొంతనలేని సమాధానం చెప్తుండడంతో మరింతో లోతుగా విచారణ జరుపుతున్నారు.
మొదట శ్రీధరణి ఎవరో తనకు తెలీదన్న నవీన్ ఆ తరువాత ఇద్దరూ కలిసి కొండపైకి వెళ్లామని.. అక్కడ తమపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు చెప్పాడు. నిమిషానికో మాట మారుస్తుండడంతో పోలీసులు అతనిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ తలవెనుక భాగంలో బలమైన గాయం అయినట్లు చెప్తున్నారు. ఇక హత్యకు గురైన శ్రీ ధరణికి మార్చి9వ తేదీన దగ్గరి బందువు అబ్బాయితో వివాహ నిశ్చితార్థం జరుగవలసి ఉంది.
Read Also: కొత్త చట్టం ఎఫెక్ట్ : మళ్లీ నోట్ల కష్టాలు రాబోతున్నాయా.. ATMలు ఖాళీనా!