Dog Attack: ఒక వీధి కుక్క దాడిలో ఇద్దరు డాక్టర్లు సహా ఐదుగురికి తీవ్ర గాయాలు

మృతికి గల కారణాలు తెలియరాగా, కుక్క రేబిస్‌తో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. క్యాంపస్‌లోని రేడియాలజీ విభాగం వెలుపల ఉన్న వ్యక్తులపై కుక్క అకస్మాత్తుగా దాడి చేసిందని, ఇద్దరు రెసిడెంట్ వైద్యులు, ఇద్దరు పారామెడికల్ సిబ్బంది, ఒక అటెండర్‌ను కరిచినట్లు కేజీఎంయూ అధికారులు తెలిపారు

Dog Attack: ఒక వీధి కుక్క దాడిలో ఇద్దరు డాక్టర్లు సహా ఐదుగురికి తీవ్ర గాయాలు

Updated On : May 12, 2023 / 4:51 PM IST

Lucknow: ఉత్తరప్రదేశ్ (uttar pradesh) రాష్ట్ర రాజధాని లఖ్‭నవూ(Lucknow)లోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ క్యాంపస్‌(King George’s Medical University)లో వీధికుక్క దాడిలో ఇద్దరు రెసిడెంట్ డాక్టర్లు సహా ఐదుగురు గాయపడ్డారు. లఖ్‭నవూలో గత ఏడాది కాలంలో జరిగిన తీవ్రమైన కుక్కల దాడి కేసులో ఇది ఒకటని స్థానిక పోలీసులు తెలిపారు. యూనివర్శిటీ అధికారులు లక్నో మున్సిపల్ కార్పొరేషన్‭కి సమాచారం అందించారు. వారు వెంటనే క్యాంపస్‌కు ఒక బృందాన్ని పంపగా, అప్పటికే కుక్క చనిపోయిందని గుర్తించారు.

Imran Khan Arrest: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‭కు 2 వారాల బెయిల్

మృతికి గల కారణాలు తెలియరాగా, కుక్క రేబిస్‌తో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. క్యాంపస్‌లోని రేడియాలజీ విభాగం వెలుపల ఉన్న వ్యక్తులపై కుక్క అకస్మాత్తుగా దాడి చేసిందని, ఇద్దరు రెసిడెంట్ వైద్యులు, ఇద్దరు పారామెడికల్ సిబ్బంది, ఒక అటెండర్‌ను కరిచినట్లు కేజీఎంయూ అధికారులు తెలిపారు. బాధితులు సుష్మా యాదవ్, సంజయ్ గుప్తా, ఇద్దరు వైద్య సిబ్బంది మీద కుక్క దాడి చేయగానే ఇతర సిబ్బంది వారిని రక్షించారు. అనంతరం వారికి ప్రథమ చికిత్సతో పాటు రేబిస్ కోసం యాంటీబాడీస్, వ్యాక్సిన్‌లను అందించారు. ఆ తర్వాత వారిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.

UK Youth : దొంగలుగా మారుతున్న బ్రిటన్ యువత, సూపర్ మార్కెట్లలో చోరీలు .. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

దాడిలో గాయపడిన డాక్టర్ సుష్మా యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ “నేను రేడియో డయాగ్నస్టిక్ డిపార్ట్‌మెంట్ నుంచి బయటికి వస్తుండగా అకస్మాత్తుగా ఒక వీధికుక్క వచ్చి నా కుడి కాలుపై కరిచింది. నేను బిగ్గరగా అరిచాను. కుక్కను తరిమి కొట్టడానికి ప్రయత్నించాను. కానీ అది మళ్ళీ నా కుడి చేతిపై దాడి చేసింది” అని అన్నారు. ఆమె కుడి కాలుపై రెండు అంగుళాల పొడవైన గాయం అయింది. కాగా, సంజయ్ గుప్తాకు ఎడమ కాలుపై ఒక అంగుళం వరకు గాయం అయింది.

Maharashtra Politics: షిండే కలలో కూడా ఆ పని చేయడు.. ఉద్ధవ్ వ్యాఖ్యలకు పవార్ కౌంటర్

సంఘటన తర్వాత, తాను కుక్కను పట్టుకోవాలని లఖ్‭నవూ మున్సిపల్ వారికి సమాచారమిచ్చానని, అయితే మున్సిపల్ బృందం వచ్చేలోపే అది చనిపోయిందని కేజీఎంయూ ప్రతినిధి సుధీర్ సింగ్ తెలిపారు. కుక్క రేబిస్‌తో బాధపడుతోందని, ఈ వ్యాధి కుక్కలను దూకుడుగా చేస్తుందని, అయితే ఆ వ్యాధి సోకిన వారంలోనే కుక్కలు చనిపోతాయని ఎల్‌ఎంసి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అభినవ్ వర్మ అన్నారు.