Honey Trap In Mangalore : హానీ‌ట్రాప్‌లో పడ్డ వ్యాపారి…మద్యం సేవిస్తూ….

కష్టపడి డబ్బు సంపాదించాలనే ఆలోచన పోయింది చాలామందికి. అక్రమంగా, ఈజీ మనీ సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కర్ణాటకలోని మంగుళూరులో ఒక వ్యాపార వేత్తను హానీ ట్రాప్ చేసిన జంట ఆ వ్యాపార వేత్త నుంచి రూ.2.85 లక్షలు వసూలు చేసింది.

Honey Trap In Mangalore : హానీ‌ట్రాప్‌లో పడ్డ వ్యాపారి…మద్యం సేవిస్తూ….

Honey Trap In Mangalore

Updated On : July 30, 2021 / 5:10 PM IST

Honey Trap In Mangalore : కష్టపడి డబ్బు సంపాదించాలనే ఆలోచన పోయింది చాలామందికి. అక్రమంగా, ఈజీ మనీ సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కర్ణాటకలోని మంగుళూరులో ఒక వ్యాపార వేత్తను హానీ ట్రాప్ చేసిన జంట ఆ వ్యాపార వేత్త నుంచి రూ.2.85 లక్షలు వసూలు చేసింది.

ఉల్లాల్ ప్రాతంలో ఓ అపార్ట్ మెంట్ లో సిఎం రిజ్వాన్(24) హతిజమ్మ అలియాస్ స్వప్న(23) నివసిస్తున్నారు. వీరికి అదే అపార్ట్ మెంట్ లో వేరే ప్లాట్ లో నివసించే వ్యాపారవేత్తతో పరిచయం అయ్యింది.  జులై19న రిజ్వాన్, స్వప్న వ్యాపార వేత్త ఇంటికి వెళ్లారు.  అక్కడ ముగ్గురు మద్యం  సేవించారు.

ముందస్తు ప్లాన్  ప్రకారం స్వప్న వ్యాపార వేత్తతో ఎక్కువ మద్యం తాగించింది. మద్యం మత్తులో అపస్మారక స్ధితిలోకి వెళ్ళిన వ్యాపారవేత్త బట్టలు విప్పిన స్వప్న,  అతడితో సన్నిహితంగా వ్యవహరించగా….. రిజ్వాన్ వారిద్దరినీ ఫోటోలు, వీడియోలు తీశాడు.

మరునాడు ఆఫోటోలు వ్యాపారవేత్తకు  పంపించి బ్లాక్ మెయిల్ చేశారు. అతని వద్ద నుంచి రూ.2.85 లక్షల నగదుతోపాటు ఒక బంగారు ఉంగరం తీసుకున్నారు. మళ్లీ  రెండురోజులకు ఇంకో సారి డబ్బులు డిమాండ్ చేయటంతో వ్యాపార వేత్త   జులై 23న పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి కేసుల్లో బాధితులెవ్వరూ వెనకడుగు వెయ్యవద్దని ఇలాంటివి జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంగుళూరు పోలీసు కమీషనర్ ఎన్.శశికుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.