ఎస్సైపై దాడి – ఇద్దరు యువకులు అరెస్ట్

ఎస్సైపై దాడి – ఇద్దరు యువకులు అరెస్ట్

Updated On : January 18, 2021 / 7:03 PM IST

Two men arrested , due to attack on pachipenta SI : విజయనగరం జిల్లాలో ఒక ఎస్సైపై దాడిచేసిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం ఖడ్గవలస గ్రామంలో ఈ ఘటన జరిగింది. జనం రద్దీ ఎక్కువగా ఉన్న చోట బైక్ ను అతివేగంగా నడపుతున్న ఇద్దరు యువకులను పాచిపెంట ఎస్సై రమణ స్పీడ్ తగ్గించమని చెప్పారు. దీనికి ఆగ్రహించిన యువకులు ఎస్సై తో గొడవకు దిగి ఆయనపై దాడి చేశారు.

ఆయన హెల్మెట్ లాక్కుని హెల్మెట్ తో కొట్టారు.   చొక్కా చించి వేసి  ఎస్సైపై   పిడిగుద్దులతో దాడి చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా సెలవు పెట్టి   అత్తగారింటికి వెళ్లి, తిరిగి పాచిపెంట వెళుతుండగా ఎస్సై వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ నిర్లక్ష్యంగా  డ్రైవింగ్  చేస్తున్న  యువకులకు హిత బోధ చేశాడు.సివిల్ డ్రస్ లో ఉన్న ఎస్సైని గుర్తించని యువకులు  ఎస్సైతో గొడవకు దిగారు.

తమకు అడ్డు చెపుతావా, మాకు నీతులు బోధిస్తావా  అంటూ ఆగ్రహంతో  యువకులు బండి ఆపి ఎస్సై పై దాడికి పాల్పడి, చొక్కాచించి విచక్షణా రహితంగా కొట్టారు. ఈలోగా స్ధానికులు అడ్డుకుని యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్సై ఇచ్చిన ఫిర్యాదుతో ఖడ్గవలస  పోలీసులు కేసు నమోదు చేసి యువకులను అరెస్ట్ చేశారు.