కారు, 3 బైకులు, ఆటోపై దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు మృతి
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కృష్ణాసాగర్ జాతీయ రహదారిపై లారీ బీభత్సం సృష్టించింది. ఓ కారు, మూడు బైకులు, ఆటోపై లారీ దుసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో అది మరొక ఆటోను, రెండు బైకులను బలంగా ఢీ కొట్టింది. వెంటనే స్థానికులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఒకరు మృతి చెందారు.
మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదం జరిగిన తీరు చాలా భయానకంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ మద్యం సేవించినట్లుగా తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణాసాగర్ ఐటీసీ జంక్షన్ దగ్గర నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉందని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు పలుమార్లు ఆందోళన చేశారు. ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ ఫలితం శూన్యం.