AP Crime News : ప్రేమ గుడ్డిది..ఆమెకు 17..అతనికి 42..!

తన కంటే పాతికేళ్లు చిన్నదైన బాలికతో ప్రేమ వ్యవహారం నడిపి ఇద్దరూ కల్సి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

AP Crime News : ప్రేమ గుడ్డిది..ఆమెకు 17..అతనికి 42..!

Love Affair

Updated On : August 18, 2021 / 4:05 PM IST

AP Crime News : ఇద్దరి మధ్య ప్రేమ చిగురించటానికి హద్దులు లేవంటారు కవులు. అది సాహిత్యపరంగా బాగానే ఉంటుంది… కానీ మనం నాగరిక సమాజంలో బతుకుతున్నప్పుడు  వావి,వరస,వయస్సు గమనించుకోవాలి.  దాదాపు తన కంటే పాతికేళ్లు చిన్నదైన బాలికతో ప్రేమ వ్యవహారం నడిపి… ప్రేమికులు ఇద్దరూ కల్సి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ లాడ్జిలో ఇద్దరు బుధవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.  రామయ్య(42) అనే వ్యక్తి,  17 ఏళ్ల బాలిక  లాడ్జిలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు బాలిక పరిస్ధితి విషమంగా ఉండటంతో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామయ్యను బుచ్చిరెడ్డి పాలెంలోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రేమ వ్యవహారంలోనే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.