Unidentified Dead Body : గుర్తు తెలియని మహిళ దారుణ హత్య
నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం ముల్లంగి గ్రామ శివారులోని పంట పొలాల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం అయ్యింది.

Un Identified Ded Body
Unidentified Dead Body : నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం ముల్లంగి గ్రామ శివారులోని పంట పొలాల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం అయ్యింది. మృతదేహం సగం కాలిపోయి ఉంది. సగానికిపైగా కాలిన మృతదేహాన్ని చూసిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. మరణించిన మహిళ వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని… మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మక్లూర్ మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో గత రెండురోజులుగా కనిపించకుండాపోయిన మహిళల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read : Extra Marital Affair : భార్య వివాహేతర సంబంధం..ప్రియుడితో కలిసి…….!