ఫేస్ బుక్ లో స్నేహం..నగ్న వీడియోలు..బ్లాక్ మెయిల్

ఫేస్ బుక్ లోవచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ కు కన్ ఫర్మ్ చేశాడా యువకుడు. అప్పటినుంచి ఆయువతితో చాటింగ్ చేయటం మొదలెట్టాడు. చివరికి ఆమె చేసిన మోసానికి బలై గిలగిలా కొట్టకుంటున్నాడు. బెంగుళూరు లోని సుల్తాన్ పాళ్యంకుచెందిన 32 ఏళ్ల వ్యక్తికి ఫేస్ బుక్ లో ఒక 30 మహిళ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది.
ఆమె ఎవరో తనకు తెలియకపోయినా రిక్వెస్ట్ కన్ ఫర్మ్ చేశాడు. మెసెంజర్ లో చాట్ చేసుకోవటం మొదలెట్టి క్రమేపి ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు మార్చుకుని ఫోన్లలో మాట్లాడుకోవటం వాట్సప్ చాటింగ్ ల దాకా వారి స్నేహం అభివృధ్ధి చెందింది.
ఈక్రమంలో జూన్ 19న ఆయువతి వీడియో కాల్ చేసి నగ్నంగా కనిపిస్తూ అతడిని రెచ్చగొట్టింది. అలా చేస్తూ అతడిని నగ్నంగా కనపించమని కోరింది. దీంతో ఆయువకుడు కూడా నగ్నంగా యువతితో వీడియో కాల్ లో మట్లాడాడు. ఈ సమయంలో అతడికి తెలియకుండా అతని నగ్నవీడియో ను స్క్రీన్ రికార్డర్ ద్వారా తన ఫోన్ లో రికార్డు చేసింది. వీడియో చాటింగ్ అయిన కొద్ది సేపటి తర్వాత ఫోన్ చేసి నీ నగ్న వీడియోలు నా దగ్గర ఉన్నాయి. నాకు డబ్బులు ఇవ్వక పోతే అవి సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించింది.
దీంతో భయపడిన ఆ వ్యక్తి ఆమెకు 10 వేలరూపాయలను పంపించాడు. ఇదే విధంగా ఆమె తరచూ డబ్బులివ్వాలని బ్లాక్ మెయిల్ చేయటంతో విసిగిపోయిన వ్యక్తి నార్త్ జోన్ సైబర్ క్రైం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసుకున్న పోలీసులు యువతి కోసం గాలిస్తున్నారు.
Read: యువతిని ఎరగా వేసి యువకుడి హత్య