40ఏళ్ల మహిళపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం…FIR నమోదు

  • Published By: venkaiahnaidu ,Published On : February 19, 2020 / 01:30 PM IST
40ఏళ్ల మహిళపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం…FIR నమోదు

Updated On : February 19, 2020 / 1:30 PM IST

ఓ మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ త్రిపాఠి,ఆయన ఆరుగురు కుటుంబసభ్యులపై ఇవాళ(ఫిబ్రవరి-19,2020) బదోహి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.

బదోహీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రవీంద్రనాథ్ తను 2017లో ఓ హోటల్ లో బంధించి పలుసార్లు రేప్ చేశాడని,అతని మేనల్లుడు సహా ఆరుగురు ఫ్యామిలీ వ్యక్తులు కూడా తనపై హత్యాచారం చేశారంటూ ఫిబ్రవరి-10,2020న 40ఏళ్ల మహిళ కంప్లెయింట్ ఇచ్చినట్లు ఎస్పీ రామ్ బదన్ సింగ్ తెలిపారు. అంతేకాకుండా తాను ప్రగ్నెంట్ కూడా అయినట్లు,బలవంతంగా అబార్షన్ చేయించారని కూడా ఆ మహిళ చెప్పినట్లు ఎస్పీ తెలిపారు.

మహిళ కంప్లెయింట్ మేరకు దీని దర్యాప్తును ఏఎస్పీ రవీంద్ర వర్మకు అప్పగించామని,ఆయన రిపోర్ట్ అందించాడని,దీంతో ఇవాళ బదోహి సిటీ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే,ఆయన ఆరుగరు ఫ్రెండ్స్ పై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు ఎస్పీ తెలిపారు. సదరు మహిళ స్టేట్ మెంట్ ను మెజిస్ట్రేట్ సమక్షంలో రికార్డ్ చేయబడుతుందపి,ఆ తర్వాత చట్టప్రకారం తదుపరి చర్య తీసుకోనున్నట్లు ఎస్పీ రామ్ బదన్ సింగ్ తెలిపారు.