జర్నలిస్టు హత్య కేసు తీర్పు : పంజాబ్, హర్యానాలో హైఅలర్ట్
జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్య కేసు తీర్పును జనవరి 11 శుక్రవారం పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు వెలువరించనుంది.
జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్య కేసు తీర్పును జనవరి 11 శుక్రవారం పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు వెలువరించనుంది.
ఢిల్లీ : పంజాబ్, హర్యానాలో హైఅలర్ట్ కొనసాగుతోంది. జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్య కేసు తీర్పును జనవరి 11 శుక్రవారం పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు వెలువరించనుంది. ఈనేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో భారీగా భద్రతా బలగాలను మోరించారు.
2002లో జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్యకు గురయ్యారు. జర్నలిస్టు హత్య కేసులో డేరాబాబా ఆరోణలు ఎదుర్కొంటున్నారు. డేరాబాబా ప్రధాన కార్యాలయంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను పూరసచ్ పత్రికలో ప్రచురించిన రామచంద్ర ఛత్రపతి..ఆ తర్వాత అనుమానాస్పద స్థితిలో హత్యకు గురుయ్యాడు. ఈ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ ప్రత్యేక కోర్టులో డేరాబాబా విచారణకు హాజరు కానున్నారు. రెండు రాష్ట్రాల్లో బెటాలియన్లను మోహరించారు. పంజాబ్, హన్యానా రాష్ట్రాల్లో ఉద్రిక్తత నెలకొంది.