లంచం తీసుకుంటున్న పశువుల డాక్టర్ అరెస్టు

  • Published By: chvmurthy ,Published On : March 6, 2019 / 03:12 PM IST
లంచం తీసుకుంటున్న పశువుల డాక్టర్ అరెస్టు

హైదరాబాద్: ఆవుకు హెల్త్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న ఓ పశువుల డాక్టర్ ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ ప్రభుత్వ పశువైద్య శాలలో పని చేస్తున్న వెటర్నరీ డాక్టర్ రవిచంద్ర  హనుమంతు ఆనే రైతుకు  చెందిన ఆవుకు  హెల్త్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.7,200 డిమాండ్ చేశాడు.  లంచం ఇచ్చుకోలేని రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు  తీసుకున్న అధికారులు బుధవారం హనుమంతు నుండి డబ్బులు తీసుకుంటున్న డాక్టర్ అసిస్టెంట్ పర్వీన్ ను, డాక్టర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.