Wajedu SI Rudrarapu Harish : ప్రేమ వ్యవహారమా? పని ఒత్తిడా? కలకలం రేపుతున్న వాజేడు ఎస్ఐ బలవన్మరణం..
ఎంతో కష్టపడి చదివించి ఎస్ఐని చేశామని తల్లి రోదిస్తున్నారు.

Wajedu SI Rudrarapu Harish : ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీశ్ బలవన్మరణం సంచనలంగా మారింది. ఆయన మృతి పలు అనుమానాలు కలిగిస్తోంది. ముళ్లకట్ట సమీపంలోని ఒక రిసార్ట్ లో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోవడం వెనకున్న కారణాలు ఏంటి అనేవి ఆసక్తికరంగా మారాయి. ప్రేమ వ్యవహారామా? లేక పని ఒత్తిడి? అన్నది అంతు చిక్కకుండా ఉంది.
2020 బ్యాచ్ కు చెందిన హరీశ్ కు వాజేడులో ఎస్ఐగా మొదటి పోస్టింగ్ వచ్చింది. ఎంతో ఆనందంతో చార్జ్ తీసుకున్నారు హరీశ్. అయితే ఎస్ఐగా బాధ్యతలు తీసుకుని 6 నెలలు తిరిగేసరికే ఇలా బలవన్మరణం చెందడం అందరిని షాక్ కి గురి చేసింది. ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామం. ఎంతో కష్టపడి చదివించి ఎస్ఐని చేశామని తల్లి రోదిస్తున్నారు. ఇటు హరీశ్ చాలా మంచి వాడని మండలం ప్రజలు చెబుతున్నారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఎస్ఐ ఎందుకిలా చేశారో తెలుసుకునే పనిలో పడ్డారు. కాగా, వ్యక్తిగత కారణాలతోనే ఎస్ఐ హరీశ్ బలవన్మరణం చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ హరీశ్ ఆదివారం డ్యూటీ చేశారు. ఆ తర్వాత రిసార్ట్ కి వెళ్లారు. అక్కడ ఈ ఘటన జరిగింది. ఎస్ఐ బలవన్మరణంతో గ్రామంలో విషాదం అలుముకుంది. తల్లి, కుటుంబసభ్యులు షాక్ కి గురయ్యారు. కొడుకు ఇక లేడని తెలిసి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్ఐ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి.
Also Read : తీవ్ర విషాదం.. బుల్లితెర నటి శోభిత బలవన్మరణం…