Illegal Affair : ఆసుపత్రిలో భార్య ఉద్యోగం…అంబులెన్స్ డ్రైవర్‌తో ప్రేమాయణం…కలిసొచ్చిన కరోనా కాలం
ఈఎస్‌ఐ ఆస్పత్రిలో పని చేస్తున్న వివాహిత మహిళ అంబులెన్స్ డ్రైవర్‌తో ప్రేమాయణం సాగించసాగింది. లాక్‌డౌన్ వల్ల అందరూ ఇంటికే పరిమితం అయినా డ్యూటీ పేరుతో ఆస్పత్రికి వెళ్లిన మహిళ అంబులెన్స్ డ్రైవరతో సరససల్లాపాలాడేది.

Wife Killed Husband With Paramour
Illegal Affair : ఈఎస్ఐ ఆస్పత్రిలో పని చేస్తున్న వివాహిత మహిళ అంబులెన్స్ డ్రైవర్‌తో ప్రేమాయణం సాగించసాగింది. లాక్‌డౌన్ వల్ల అందరూ ఇంటికే పరిమితం అయినా డ్యూటీ పేరుతో ఆస్పత్రికి వెళ్లిన మహిళ అంబులెన్స్ డ్రైవరతో సరససల్లాపాలాడేది. విషయం తెలిసి భర్త నిలదీయటంతో ప్రియుడు, తన మైనర్ తమ్ముడితో కలిసి ప్లాన్ చేసి భర్తను హత్య చేసింది.
తమిళనాడు, కోయంబత్తూరులోని ఒండిపూడూరు సమీపంలోని నేసవలార్ కాలనీలో ఎం.సేతురాజారామ్ సింగ్, అతని భార్య సౌందర్య(25) ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. రోజూ కూలీపని చేసుకు బతికే రాజారామ్ సింగ్ ఆరేళ్లక్రితం ఈఎస్ఐ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో స్వీపర్ గా పనిచేసే సౌందర్యను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత రెండేళ్లుగా సౌందర్య ఇంటి గురించి పట్టించుకోకుండా… భర్తతోనూ సఖ్యంగా ఉండక కుటంబాన్ని నిర్లక్ష్యం చేయసాగింది.
ఆస్పత్రి నుంచి వచ్చాక, ఇంటి గురించి, పిల్లల గురించి పట్టించు కోవటం లేదేమిటని భర్త చాలాసార్లు సౌందర్యతో గొడవపడ్డాడు. కాగా సౌందర్య ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసే నీలికోలాయపాలెం కు చెందిన గుణశేఖర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమైనా వైద్య సిబ్బంది ఆస్పత్రులకు వెళ్ళాల్సి రావటం వారికి కలిసొచ్చింది. రోజూ ఆస్పత్రిలో సౌందర్య, గుణశేఖర్‌తో కలిసి ఎంజాయ్ చేయటం మొదలెట్టింది.
మొగుడి కంటే ప్రియుడిమీదే మోజు ఎక్కవయ్యింది. దీంతో కరోనా పని పేరు చెప్పి సౌందర్య ఎక్కవ సమయం గుణశేఖర్‌తో సన్నిహితంగా మెలిగేది. ఇంటికి వచ్చినా భర్తను పట్టించుకోకపోవటంతో రాజారామ్ భార్యపై నిఘా పెట్టాడు. గుణశేఖర్‌తో జరుపుతున్న వివాహేతర సంబంధాన్ని పసిగట్టాడు. ఆస్పత్రిలో ప్రియుడు గుణశేఖర్‌తో ఎంజాయ్ చేస్తున్నవిషయాన్ని తెలుసుకున్న రాజారామ్ ఒకరోజు భార్య సౌందర్యను నిలదీశాడు.
ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేసరికి ఆమెను చితకబాదాడు. జులై 23న భర్త తనను కొట్టాడని స్ధానిక మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరిని స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేశారు. ఇంటికి తిరిగి వచ్చినా భర్త ఆమె అక్రమ సంబంధం గురించి మాటలతో హింసించసాగాడు. భర్త బతికి ఉంటే తన సంతోషాలకు సరదాలకు అడ్డుగా ఉంటాడని భావించిన సౌందర్య భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది.
ప్రియుడు గుణశేఖర్‌తో కలిపి ప్లాన్ చేసింది. తన 17 ఏళ్ల తమ్ముడు, అతని స్నేహితులు, గుణశేఖర్‌లు భర్తను అంతమొందించేందుకు ప్లాన్ చేశారు. భర్త నిద్రిస్తున్నప్పుడు హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. జులై 25 ఆదివారం రాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో ప్రియుడు గుణశేఖర్‌కు, తమ్ముడికి ఫోన్ చేసి చెప్పింది. తన ముగ్గురు మిత్రులతో కలిసి ఆమె తమ్ముడు వచ్చాడు. గుణశేఖర్ సౌందర్య ఇంటికి చేరుకున్నాడు.
అంతా కలిసి నిద్రలో ఉన్న రాజారామ్‌ను గొంతుకోసి పరారయ్యారు. ఈక్రమంలో రాజారామ్ గట్టిగా కేకలు వేయటంతో చుట్టు పక్కల వారు ఇంటికి చేరుకున్నారు. వెంటనే అతడ్ని కొయంబత్తూరు మెడికల్ కాలేజీలో చేర్పించారు. తన భర్త నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి హత్య చేశారని వైద్యులకు తెలిపింది. సోమవారం ఉదయానికి స్పృహలోకి వచ్చిన రాజారామ్ తన భార్య, బావమరిది, ఆమె ప్రియుడు మరికొందరితో కలిసి హత్యాయత్నం చేశారని వివరించాడు. కోయంబత్తూరు మెడికల్ కాలేజీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి అతని వద్దవాంగ్మూలం తీసుకున్నారు. తన భార్య వివాహేతర సంబంధం గురించి పోలీసులకు చెప్పాడు.
రాజారామ్ వద్ద వాంగ్మూలం తీసుకున్న పోలీసులు వెంటనే సౌందర్యను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారంతో ప్రియుడు గుణశేఖర్, ఆమె తమ్ముడు, అతని మిత్రులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసు విచారణలో తానే హత్యకు ప్లాన్ చేశానని సౌందర్య ఒప్పుకుంది. మైనర్లు నలుగురిని లక్ష్మీ మిల్స్ జంక్షన్‌లో ఉన్న బాలనేరస్తుల జైలుకు, సౌందర్యను కొయంబత్తూరులోని మహిళల జైలుకు. గుణశేఖర్‌ను పొల్లాచ్చి సబ్‌జైలుకు తరలించారు. కేసుదర్యాప్తు కొనసాగుతోంది.