Extra Marital Affair : ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

తమిళనాడులో తాగుబోతు భర్తను, ప్రియుడితో కలిసి హతమార్చిందో ఇల్లాలు. తన భర్త అతిగా తాగి చనిపోయాడని కుటుంబీకులను నమ్మించటానికి ప్రయత్నించింది.

Extra Marital Affair : ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

coimbatore murder

Updated On : December 27, 2021 / 4:12 PM IST

Extra Marital Affair Murder :  తమిళనాడులో తాగుబోతు భర్తను, ప్రియుడితో కలిసి హతమార్చిందో ఇల్లాలు. తన భర్త అతిగా తాగి చనిపోయాడని కుటుంబీకులను నమ్మించటానికి ప్రయత్నించింది.   పోలీసు విచారణలో భార్యే   ఈనేరం చేసిందని రుజువయ్యింది.  కోయంబత్తూరు సమీపంలోని తుడియలూరులో నివసించే రాజా అనే ఎలక్ట్రీషియన్‌కు   12 సంవత్సరాల క్రితం ఆర్.రీనా   అనే  యువతితో వివాహం జరిగింది.

రాజాకు మద్యం తాగే అలవాటు ఉంది. మద్యం తాగి వచ్చినప్పుడల్లా రాజా రీనాను కొట్టేవాడు. ఈక్రమంలో రాజా డిసెంబర్ 22న అధిక మోతాదులో మద్యం సేవించటం వల్ల చనిపోయాడని ఆమె రాజా కుటుంబీకులకు తెలిపింది.  రాజా ఇంటికి వచ్చిన వారికి అతని శరీరంపై గాయాలున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు రాజా మృతదేహాన్ని పోస్టుమార్టం  నిమిత్తం కోయంబత్తూరు వైద్య కళాశాల ఆస్పత్రికి పంపించి కేసు నమోదు చేసుకున్నారు.  పోస్టుమార్టం రిపోర్టులో రాజా   గొంతు  నులిమి హత్యచేయటం వల్ల మరణించినట్లు నివేదిక వచ్చింది. దీంతో పోలీసులు రీనాను అదుపులోకి  తీసుకుని విచారించగా ఆమె నేరం అంగీకరించింది.
Also Read : Vijayawada : వైద్య పరికరాల చీటింగ్ కేసు-విజయవాడలో రూ.23 లక్షల మోసం

రీనా తన ప్రియుడు సతీష్‌తో   కలిసి భర్తను హత్య చేసినట్లు  విచారణలో తేలింది.  రీనాకు కవుందపాలెం, అంబేద్కర్ నగర్ కు చెందిన సతీష్ అనే వ్యక్తితో   పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం   క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈవిషయం రాజాకు రెండేళ్ల క్రితం తెలిసింది. భార్యను  వివాహేతర సంబంధం మానుకోవాలని హెచ్చరించాడు.  అయినా ఆమె మానలేదు. మరోవైపు భర్త రోజు తాగి వచ్చి కొట్టటంతో విసుగు చెందిన ఆమె భర్తను  తుదముట్టించాలనుకుంది.  ప్రియుడు సతీష్ తో కలిసి భర్తను హత్యచేసి అతిగా  తాగటం వల్ల మరణించాడని చెప్పి కేసును తప్పుదోవ పట్టించాలని చూసింది. కానీ విచారణలో నేరం ఒప్పుకుంది.