Warangal Crime: నర్సంపేటలో వైన్ షాపు యజమాని కిడ్నాప్ కలకలం

వరంగల్ జిల్లా నర్సంపేటలో వైన్ షాపు యజమానిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ కు యత్నించిన ఘటన బుధవారం కలకలం రేపింది.

Warangal Crime: నర్సంపేటలో వైన్ షాపు యజమాని కిడ్నాప్ కలకలం

Police

Updated On : January 26, 2022 / 11:07 PM IST

Warangal Crime: వరంగల్ జిల్లా నర్సంపేటలో వైన్ షాపు యజమానిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ కు యత్నించిన ఘటన బుధవారం కలకలం రేపింది. ఘటనపై సమాచారం అందుకున్న నర్సంపేట పోలీసులు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ముత్యం శ్రీనివాస్ అనీ వ్యక్తి నర్సంపేటలో వైన్ షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం మాదన్నపేట చెరువు కట్టపై.. శ్రీనివాస్ వాకింగ్ కి వెళ్ళాడు. ఒంటరిగా ఉన్న శ్రీనివాస్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

Also Read: Girl Tortured: 14 ఏళ్ల బాలికను నిర్బంధించి మూడు రోజులుగా యువకుడు చిత్రహింసలు

కిడ్నాప్ పై సమాచారం అందుకున్న నర్సంపేట పోలీసులు..దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా లభించిన ఆధారాల మేరకు.. దుండగులు శ్రీనివాస్ ని కిడ్నాప్ చేసి.. కొత్తగూడ మండలం గుంజేడులో నిర్బంధించినట్లు గుర్తించారు. పోలీసులు గుంజేడుకు చేరుకునే సమయానికే కిడ్నాపర్లు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం శ్రీనివాస్ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. అతను ఇచ్చిన ఆధారంగా ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Selfie Danger: సెల్ఫీ మోజులో కరెంట్ షాక్ కు గురైన యువకుడు

మహిళ..మరో నలుగురితో కలిసి శ్రీనివాస్ ను అపహరించేందుకు ప్రణాళిక వేసినట్లు పోలీసులు తేల్చారు. దీంతో మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు కిడ్నాప్ కు సహకరించి పరారీలో ఉన్న మరో నలుగురు వ్యక్తులను పట్టుకునే పనిలో ఉన్నారు. నిందితురాలు వరంగల్ జిల్లా ద్వారకపేటలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు, అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ వ్యవహారం చోటుచేసుకున్నట్లు పేర్కొన్న పోలీసులు.. పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Also Read: Corona Vaccine: రెగ్యులర్ మార్కెట్లోకి వస్తే రూ.275లుగా కోవాక్జిన్, కోవిషీల్డ్ ధరలు?