ప్రేమోన్మాది: తల్లీకూతుళ్లపై దాడి.. ఆత్మహత్య

  • Published By: vamsi ,Published On : April 15, 2019 / 02:50 AM IST
ప్రేమోన్మాది: తల్లీకూతుళ్లపై దాడి.. ఆత్మహత్య

Updated On : April 15, 2019 / 2:50 AM IST

తనను ప్రేమించలేదనే కోపంతో యువతిపై, యువతి తల్లిపై  స్క్రూడ్రైవర్‌తో దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్ 10లోని స్రవంతినగర్‌లో నివసించే శ్రీనివాస్‌రెడ్డి(31) అదే ప్రాంతంలో నివసించే యువతి(26)ని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే యువతి మాత్రం శ్రీనివాస్‌రెడ్డిని ప్రేమించేందుకు నిరాకరిస్తూ వచ్చింది.

దీంతో తట్టుకోలేకపోయిన శ్రీనివాస్‌రెడ్డి.. యువతిపై కక్ష పెంచుకుని, ఆమె ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న తల్లి సుజాతతో గొడవకు దిగాడు. శ్రీనివాస్‌రెడ్డి తనతోపాటు తెచ్చుకున్న స్క్రూడ్రైవర్‌తో ఆమెపై దాడి చేశాడు. అప్పుడే ఇంటికి వచ్చిన యువతి శ్రీనివాస్ రెడ్డిని అడ్డుకొనేందుకు ప్రయత్నించగా ఆమెపైన కూడా దాడికి దిగాడు. తల్లికి కడుపులో, ఇతర భాగాలపై గాయాలవగా.. యువతికి చేతులు, మెడ క్రింద భాగంలో గాయాలయ్యాయి. వారి అరుపులకు వచ్చిన స్థానికులు ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్పించారు.

కాగా వారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తల్లీ కూతుళ్లపై దాడి చేసిన శ్రీనివాస్ రెడ్డి వారిపై దాడి చేసిన అనంతరం  సికింద్రాబాద్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.  ప్రాథమిక వివరాలు సేకరించిన పోలీసులు నిందితుడి సోదరుడికి ఫోన్‌ చేసి విషయం తెలియజేశారు.