Delhi : ‘ఐ లవ్ యూ’ అని భర్తకు మెసేజ్ చేసి..బిల్డింగ్ పైనుంచి దూకేసింది

ముఖర్జీ నగర్ లో నిరంకారి కాలనీలో ఓ అపార్ట్ మెంట్ లో 52 ఏండ్ల నేహా, భర్త ధరమ్ వర్మలు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు, కుమార్తెలున్నారు.

Delhi : ‘ఐ లవ్ యూ’ అని భర్తకు మెసేజ్ చేసి..బిల్డింగ్ పైనుంచి దూకేసింది

Delhi

Updated On : September 23, 2021 / 4:03 PM IST

Delhi Police: ఐ లవ్ యూ అంటూ భర్తకు ఫోన్ లో మేసేజ్ పంపింది. అనంతరం ఇంటికి వస్తున్న భర్తను చూసి అమాంతం బిల్డింగ్ పై నుంచి దూకేసింది. తీవ్రగాయాలు అయిన..ఆమెను ఆసుపత్రికి తరలించగా..అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె వయస్సు 52 ఏండ్లు. దంపతులు విడిపోవాలని నిర్ణయం తీసుకోవాలని అనుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Read More : Typhoid Diet : టైఫాయిడ్‌ జ్వరం వస్తే ఏవి తినాలి? ఏవి తినకూడదో తెలుసుకోండీ..

ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ముఖర్జీ నగర్ లో నిరంకారి కాలనీలో ఓ అపార్ట్ మెంట్ లో 52 ఏండ్ల నేహా, భర్త ధరమ్ వర్మలు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు, కుమార్తెలున్నారు. వీరు అమెరికాలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో..మంగళవారం ధరమ్ బయటకు వెళ్లారు. భర్తకు ఐ లవ్ యూ అంటూ ఫోన్ లో నేహా మెసేజ్ చేసింది.

Read More : Bengaluru Blast : బెంగళూరులో భారీ పేలుడు..ముగ్గురు దుర్మరణం

తర్వాత…ఇంటికి భర్త తిరిగి వస్తుండటాన్ని చూసింది. అమాతం ఐదో అంతస్తు నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా…అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఆమె కింద పడుతున్న దృశ్యాలు సమీప సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.