Typhoid Diet : టైఫాయిడ్‌ జ్వరం వస్తే ఏవి తినాలి? ఏవి తినకూడదో తెలుసుకోండీ..

వర్షాకాలంలో వానలతో పాటు ఎన్నో రకాలు రోగాలు కూడా వస్తుంటాయి. దాంట్లో టైఫాయిడ్ ఫీవర్ ఒకటి. ఈ టైఫాయిడ్ వస్తే ఏఏ ఆహారాలు తినాలి?ఏవేవి తినకూడదో తెలుసుకుందాం..

Typhoid Diet : టైఫాయిడ్‌ జ్వరం వస్తే ఏవి తినాలి? ఏవి తినకూడదో తెలుసుకోండీ..

Typhoid

Typhoid Diet:  వర్షాకాలం అంటేనే రోగాల కాలం అని పెద్దలు అంటారు. నిజమే. వర్షాకాలంలో ఎన్నో వైరల్ సమస్యలు వస్తుంటాయి. వీటిలో స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫ్లూ ఫీవర్ లతో పాటు ఇంకా అనేక సమస్యలు వస్తుంటాయి. మన పెద్దలు చెబుతుంటారు ఏఏ కాలంలో ఏఏ ఆహారాలు తినాలి? వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి పదార్ధాలు తినాలని..అదే వాతావరణం వేడిగా ఉన్నప్పుడు మసాలాలు వంటి శరీరానికి వేడి కలిగే ఆహారాలుతినకూడదు అని. అలాగే ఆయా కాలాల్లో వచ్చే పండ్లు తినాలని కూడా చెబుతుంటారు. కానీ మనం వింటేగా..ఫలితంగా రకరకాల అనారోగ్య సమస్యలొస్తుంటాయి. దాంట్లో టైఫాయిడ్ ఫీవర్ గురించి తెలుసుకుందాం.ఈ టైఫాయిడ్ వస్తే ఏఏ ఆహారాలు తినాలి?ఏవేవి తినకూడదో తెలుసుకోవాల్సిన అసవరం ఉంది.టైఫాయిడ్. , డెంగ్యూ, చికెన్‌గున్యా, కలరా, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. వీటిల్లో టైఫాయిడ్‌ జ్వరం కొంత ప్రమాదకారనే చెప్పవచ్చు. సాధారణంగా టైఫాయిడ్‌ జ్వరం కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది. సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్‌ సంక్రమిస్తుంది. అయితే నిపుణులు సూచించిన ఈ ఆహార అలవాట్లతో ఏవిధంగా టైఫాయిడ్‌ నుంచి ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం..

Rear more: Chicken Salad Benefits : చికెన్‌ సలాడ్‌ తినండీ..అధిక బరువుకు చెక్ పెట్టండీ..

A curious case of hidden, dangerous typhoid: It's time to take action now | Business Standard News
టైఫాయిడ్‌ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి?
టైఫాయిడ్‌ ఫీవర్ ను చాలా సులభంగా గుర్తించవచ్చు. ఒళ్లువేడిగా అయిపోతుంది.తలనొప్పి, విపరీతమైన నీరసం వంటి లక్షణాలుంటాయి. అంతేకాదు జ్వరంలో తీవ్రత ఉంటుంది. అలాగే తలనొప్పి, కడుపునొప్పి, నీరసం, వాంతులు, విరేచనాలు ఉంటాయి. కొంతమందిలో విరేచనాలు కాకుండా మలబద్దకం ఉ:టుంది. ఇటువంటి లక్షణాలు ఉంటే అది టైఫాయిడ్ గా గుర్తించాలి. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో అడిగి తెలుసుకోవాలి. నిపుణులు చెప్పినట్లుగా ఆహారం తీసుకోవాలి.టైఫాయిడ్.ఎంటర్టిక్ ఫీవర్ (పేగులకు సంభవిస్తుంది లేదా సంభవిస్తుంది) అని కూడా పిలుస్తారు, ఇది గ్రామ్-నెగటివ్ బాక్టీరియం అయిన సాల్మొనెల్లా టైఫీ వలన కలిగే ఒక రకమైన బ్యాక్టీరియా సంక్రమణ. సంక్రమణ సాధారణంగా కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా వ్యాపిస్తుంది.

Rear more: Covid-19 : కొవిడ్‌ సోకిన గర్భిణుల్లో ఇన్పెక్షన్‌ ముప్పు ఎక్కువ!

టైఫాయిడ్..అస్సలు తీసుకోకూడని ఆహారాలు..
టైఫాయిడ్ జ్వరం వస్తే విపరీతమైన అలసట ఉంటుంది. వైట్ బ్లడ్ సెల్స్ లోపం వల్ల నీరసం ఎక్కువగా ఉంటుంది. టైఫాయిడ్‌ జ్వరం నుంచి త్వరగా తేరుకోవడానికి కొన్ని రకాల ఆహార అలవాట్లు తప్పక పాటించాలి. తొక్క తీయకుండా తినే పండ్లు అంటే తొక్కతీయని పండ్లు అంటే జామ,యాపిల్ వంటివి. కూరగాయాలు, ఘాటుగా ఉండే ఆహారం, ఆయల్ ఫుడ్స్, అలాగే నెయ్యితో వండిన ఆహార పదార్ధాలు తినకూడదు. ఎందుకంటే ఇవి మీ కడుపులో మంట లేదా తాపాన్ని పుట్టించే అవకాశం ఉంది. దీని వల్ల జ్వరం తగ్గదు సరికదా వేరే సమస్యలు వస్తాయి.

Foods to Eat and Avoid During Typhoid

ఏవి తినకూడదంటే..
టైఫాయిడ్ జ్వరం వస్తే జీర్ణశక్తి తగ్గిపోతుంది.అందుకే త్వరగా జీర్ణం అయ్యే తేలికపాటి ఆహారాలు తినాలి. ముఖ్యంగా కడుపులో గ్యాస్‌ను పుట్టించే కొన్ని రకాల కూరగాయలు అంటే.. క్యాబేజీ, బ్రొకోలీ, క్యాలీఫ్లవర్‌ వంటివి అస్సలు తినకూడదు. అలాగే ఘాటులగా ఉండేవి అంటే ఉల్లి,వెల్లుల్లి వంటి కూడా తినకూడదు.

Typhoid Fever: Dietary Management And Foods To Avoid During Typhoid Fever

మరి ఎటువంటి ఆహారం తినాలి?
టైఫాయిడ్‌ కు చక్కటి ఆహారం ఏంటీ అంటే..ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారం కచ్చితంగా తినాలి. అంటే.. ఎక్కువగా గింజలు తినాలి. రకాలైన గింజలు, గుడ్లు వంటివి తినాలి శక్తి కోసం. సాధారణంగా జ్వరం వచ్చినవాళ్లకు ఆలుగడ్డ పెట్టరు. కానీ టైఫాయిడ్ వచ్చినవారికి ఆలూగడ్డల వేపుడు, ఉడికించిన అన్నం.. వంటి కార్బొహైడ్రేట్స్‌ పుష్కలంగా ఉండే ఆహారం పెట్టాలి.అలాగే టైఫాయిడ్‌ నుంచి కోలుకునే ప్రక్రియలో మరిన్ని నీళ్లు తాగడం మాత్రం అస్సలు మానొద్దు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. టైఫాయిడ్ అంటు వ్యాధి కూడా. కాబట్టి టైఫాయిడ్ వచ్చినవారికి దగ్గరగా ఉండకుండా ఉంటడం మంచిది.

Typhoid Diet: Overview, Foods, and Benefits

టైఫాయిడ్ వ్యాధి పాటించాల్సిన 7 జాగ్రత్తలు..
టైఫాయిడ్ వస్తే ఒంట్లో శక్తి హరించుకుపోతుంది.నీరసరం నిస్సత్తువ ఆవరిస్తుంది. కాబట్టి తినాలని లేకపోయిన తరచు ఏదోక ఆహారం తింటుండాలి. తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ద్రవాహారాలు తరచుగా తీసుకోవాలి. నీరసరం రాకుండా. టైఫాయిడ్ సమయంలో శరీరంలో ఉండే నీటిశాతం హరించుకుపోతుంది. అలాగే జ్వరం తీవ్రతో చెమటపడుతుంది. అలాగే వాంతులు విరేచనాలతో డీ హైడ్రేషన్ వస్తుంది. కాబట్టి ద్రవాహారాలు తప్పకుండా తీసుకోవాలి. ఆ సమయంలో శరీరం చైతన్యవంతం చేయడానికి..హైడ్రేట్ చేయడానికి మరియు ఎలెక్ట్రోలైట్ బ్యాలన్స్ కొనసాగించడానికి ఆరోగ్యకరమైన ద్రవాలను త్రాగాలి. టైపాయిడ్ సమయంలో కొన్నిరకాల పదార్థాలు జీర్ణం కావు. కాబట్టి మెత్తగా వండిన ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇలా టైఫాయిడ్ కు పలు ఆహార జాగ్రత్తలు చాలా చాలా అవసరం.