Woman Hacked to death : భర్త బంధువుతో భార్య వివాహేతర సంబంధం.. తెలుసుకున్న భర్త…
వివాహేతర సంబంధం ఒక మహిళ నిండు ప్రాణాన్నిబలిగొంది. తన కజిన్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను వద్దని మందలించాడు భర్త. అయినా భార్య లెక్క చేయకుండా ఆ బంధాన్ని కొనసాగించసాగింది.

Woman Hacked To Death By Husband
Woman Hacked to death by husband, due to illicit affair : వివాహేతర సంబంధం ఒక మహిళ నిండు ప్రాణాన్నిబలిగొంది. తన కజిన్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను వద్దని మందలించాడు భర్త. అయినా భార్య లెక్క చేయకుండా ఆ బంధాన్ని కొనసాగించసాగింది. సహనం కోల్పోయిన భర్త, భార్యను గొంతు నులిమి హత్య చేసి పోలీసుస్టేషన్ కు వెళ్లి లోంగిపోయిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
కోయంబత్తూరు కార్పోరేషన్ పరిధిలోని తోండముత్తూరులో నివసించే లక్ష్మణ్ రాజ్ (36) శరణ్య(26)లకు ఆరేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండేళ్లుగా శరణ్య లక్ష్మణ్ రాజ్ కజిన్ యువ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఇటీవల లక్ష్మణ్ రాజ్ ఈవిషయాన్ని పసిగట్టాడు. వివాహేతర సంబంధాన్ని మానుకోమని భార్యకు నచ్చ చెప్పాడు. అయినా శరణ్య యువతో బంధాన్ని కొనసాగించ సాగింది. దీంతో దంపతులు మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఏప్రిల్ 23 శుక్రవారం తెల్లవారు ఝూమున నిద్రపోతున్న శరణ్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత సమీపంలోని పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
లక్ష్మణ్ రాజ్ ఇంటికి చేరుకున్న పోలీసులు శరణ్య మృతదేహానికి కోయంబత్తూరు మెడికల్ కాలేజీలో పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. నిందితుడ్ని కోర్టులో హాజరు పరచి, జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు.