Acid Attack : వివాహేతర సంబంధం…మహిళపై యాసిడ్ దాడి
కృష్ణాజిల్లాలో ఓ మహిళపై ప్రియుడు యాసిడ్ తో దాడిచేశాడు. మహిళకు తీవ్రగాయాలయ్యాయి.

Acid Attack
Acid Attack : కృష్ణాజిల్లాలో ఓ మహిళపై ప్రియుడు యాసిడ్ తో దాడిచేశాడు. మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మైలవరం మండలం గణపవరం గ్రామంలో నివిసించే కట్టా వెంకాయమ్మ(38) అనే మహిళ ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు భర్త లేడు. అదే గ్రామానికి చెందిన పటాపంచుల గోపీ(35) అనే వ్యక్తితో కొన్నాళ్లుగా ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
ఇటీవలికాలంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటంతో ఆమె గోపీతో మాట్లాడటం మానేసింది. దీంతో వెంకాయమ్మపై కోపం పెంచుకున్న గోపీ ఆదివారం ఉదయం యాసిడ్ తో ఆమెపై దాడి చేశాడు. ఆమె శరీరం మొత్తం కాలి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు మైలవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని మైలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.