ఆరాంఘర్‌లో మహిళ కిడ్నాప్ కలకలం : వ్యాన్ లో ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫోన్
హైదరాబాద్ ఆరాంఘర్‌లో అర్ధరాత్రి మరో కిడ్నాప్ కలకలం రేపింది. వ్యాన్‌లో మహిళను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారంటూ ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు కాల్ చేసి చెప్పాడు. దీంతో

హైదరాబాద్ ఆరాంఘర్‌లో అర్ధరాత్రి మరో కిడ్నాప్ కలకలం రేపింది. వ్యాన్‌లో మహిళను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారంటూ ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు కాల్ చేసి చెప్పాడు. దీంతో
హైదరాబాద్ ఆరాంఘర్‌లో అర్ధరాత్రి మరో కిడ్నాప్ కలకలం రేపింది. వ్యాన్‌లో మహిళను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారంటూ ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు కాల్ చేసి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అర్ధరాత్రి ఆరాంఘర్, శంషాబాద్‌లో వాహనాల తనిఖీ చేపట్టారు. మారుతీ ఓమ్నీ వ్యాన్‌లో వెళ్తున్న ముగ్గుర్ని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యాన్‌లో మహిళలెవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ముగ్గురు అనుమానితుల్ని తెల్లవారేదాకా విచారించి వదిలిపెట్టారు. వాహనాన్ని తమ ఆధీనంలోనే ఉంచుకున్న పోలీసులు… అవసరమైతే మళ్లీ విచారణకు రావాలని ముగ్గురు వ్యక్తులకు సూచించారు.