ప్రియురాలితో ఇంటికొచ్చిన భర్త ….ఊహించని రియాక్షన్ ఇచ్చిన భార్య
బయట గుట్టుగాసాగుతున్న అక్రమ సంబంధాన్ని ఇంటికి తెచ్చాడు. పరాయి స్త్రీతో భర్తను చూసిన ఇంటి ఇల్లాలు ఉగ్రరూపం దాల్చింది.ఇంటి పెద్ద చేస్తున్నతప్పిదాన్ని చూడలేని కుటుంబ సభ్యులు ఆ స్త్రీ పై దాడి చేసి హతమార్చారు. కడప జిల్లా సిధ్ధవచటం మండలం వెంకటాయపల్లె గ్రామంలోసోమవారం ఈఘటన వెలుగు చూసింది.

సిద్దవటం మండలం పొన్నవోలు గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటాయపల్లె గ్రామానికి చెందిన గువ్వల ఓబయ్య అనే వ్యక్తికి నెల్లూరు పట్టణానికి చెందిన పద్మ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది.
వీరిద్దరూ చాలా రోజులుగా తమ తమ కుటుంబాలకు తెలియకుండా రహస్యంగా బయట కలుసుకుని రాసలీలలు సాగిస్తూ వస్తున్నారు. ఏమనుకున్నాడో ఏమో ఓబయ్య మార్చి15 ఆదివారం ఉదయం ప్రియురాలితో తనఇంట్లోనే ఎంజాయ్ చేయాలనుకుని పద్మను ఇంటికి తీసుకువెళ్లాడు.
ఓబయ్యను మరో మహిళతో చూసిన అతడి భార్య కృష్ణమ్మ షాకయ్యింది. భర్తతో గొడవ పెట్టుకుంది. పరాయి మహిళను ఏకంగా ఇంటికే తీసుకొచ్చేస్తావా అంటూ ఉగ్రరూపం దాల్చింది. కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా కృష్ణమ్మతో జతకలిసి ఓబయ్య, పద్మపై దాడికి పాల్పడ్డారు. ఓబయ్యను పక్క గదిలోకి తీసుకువెళ్ళి తాళ్లతో కట్టి బంధించారు.
అనంతంరం పద్మపై దాడి చేశారు. ఈ క్రమంలో ఆమె మెడకు కండువా బిగించటంతో ఊపిరాడక పద్మ మరణించింది. సోమవారం స్ధానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఒంటిమిట్ట పోలీసులు సిధ్ధవటం చేరుకుని పద్మ మృత దేహాన్ని పోస్టుమార్టంకోసం కడప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె బంధువులకు శవాన్ని అప్పగించారు. ఈ ఘటనపై ఓబయ్య భార్య కృష్ణమ్మ, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Also Read | కోరిక తీర్చమని కోడలికి వేధింపులు…కొడుకు చేతిలో హత్య