కూతురు బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బాయ్‌ఫ్రెండ్‌ను చంపేసింది

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో 35 ఏళ్ల మహిళ తన కూతురి బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తన ప్రియుడిని చంపేసింది. మీరట్ ఔరాంగ్‌షాపూర్‌లోని డిగ్గి ప్రాంతంలో రాజీవ్ అలియాస్ రాజు(32) మృతదేహం లభ్యమైంది. మృతదేహం లభ్యమైన తర్వాత కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు మొదలెట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.
వివరాళ్లోకి వెళ్తే.. షమిమ్ అనే మహిళ స్థానికంగా వ్యవసాయ పొలంలో కూలిగా పనిచేస్తూ ఉండేది. ఆమెకు ట్రక్ డ్రైవర్ అయిన రాజీవ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వివాహేతర సంబంధం కారణంగా షమీమ్ కుటుంబంతో కూడా రాజీవ్ సన్నిహితంగా ఉండేవాడు.
ఈ క్రమంలో షమిమ్ కూతురు స్థానికంగా ఉండే ముసాహిద్ అనే అబ్బాయితో ప్రేమలో పడింది. అయితే షమిమ్ కూతురు అతనితో ప్రేమ కలపాలు సాగిస్తుండటం రాజీవ్‌కు నచ్చలేదు. ఈ విషయమై తరచూ అతను ముసాహిద్‌తో గొడవపడుతూ ఉండేవాడు. రాజీవ్ తరచూ ముసాహిద్‌తో గొడవ పడుతూ ఉండడం, ముసాహిద్‌పై చేయి చేసుకోవడం.. తన కూతురి జీవితంలో కల్పించుకోవడం షమిమ్‌కు నచ్చలేదు.
ఈ క్రమంలో కూతురి ప్రేమికుడు సాయంతో షమిమ్ రాజీవ్‌ను ఏప్రిల్ 22వ తేదీన గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఊరికి చివర్లో రాజీవ్ మృతదేహాన్ని పడేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులైన షమిమ్, ముసాహిద్‌లను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు.