దిశ తరహా ఘటన…మహిళపై అత్యాచారం చేసి హత్య

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దిశ తరహా ఘటనలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.

  • Published By: veegamteam ,Published On : March 17, 2020 / 05:59 AM IST
దిశ తరహా ఘటన…మహిళపై అత్యాచారం చేసి హత్య

Updated On : March 17, 2020 / 5:59 AM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దిశ తరహా ఘటనలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దిశ తరహా ఘటనలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం తంగడపల్లి శివారులో వంతెన కింద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్య చేసిన ఆనవాళ్లు ఉండటంతో అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళకు సంబంధించిన వస్తువులు, దుస్తులు గానీ ఘటనాస్థలంలో లభించకపోవడంతో ఆమె వివరాలను సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది.  

20 నుంచి 30 సంత్సరాల వయస్సు ఉన్న మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. శరీరంపై అనేక గాయాలు ఉన్నాయి. మహిళ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకపోవడం, వివస్రను చేసి తీసుకొచ్చిన వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చి పరారు అయినట్లు తెలుస్తోంది. క్లూస్ టీమ్స్ ఏర్పాటు చేశారు. డాగ్ స్క్వాడ్ టీమ్స్ ఘటనాస్థలికి చేరుకుని ఘటన ఏవిధంగా జరిగిందని  పరిశీలిస్తున్నారు. 

చేవెళ్ల డీఎస్పీ రవీందర్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గురైన యువతి ఏ ప్రాంతానికి చెందిన మహిళ అనేది తెలిస్తే నిందితులను త్వరగా గుర్తించేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

Also Read | కరోనా పేషెంట్‌కు ట్రీట్మెంట్ చేసిన కర్ణాటక డాక్టర్‌కు సోకిన వైరస్