అనంతలో దారుణం : ప్రేమను కాదన్నాడని ప్రియుడి భార్య గొంతు కోసింది

అనంతపురం పట్టణంలో దారుణం జరిగింది. వివాహితుడిని ప్రేమించిన ఓ యువతి ఉన్మాదిలా ప్రవర్తించింది. తన ప్రేమకు అడ్డుగా ఉందనే కారణంతో అతడి భార్యపై ఘాతుకానికి

  • Published By: veegamteam ,Published On : November 10, 2019 / 10:17 AM IST
అనంతలో దారుణం : ప్రేమను కాదన్నాడని ప్రియుడి భార్య గొంతు కోసింది

Updated On : November 10, 2019 / 10:17 AM IST

అనంతపురం పట్టణంలో దారుణం జరిగింది. వివాహితుడిని ప్రేమించిన ఓ యువతి ఉన్మాదిలా ప్రవర్తించింది. తన ప్రేమకు అడ్డుగా ఉందనే కారణంతో అతడి భార్యపై ఘాతుకానికి

అనంతపురం పట్టణంలో దారుణం జరిగింది. వివాహితుడిని ప్రేమించిన ఓ యువతి ఉన్మాదిలా ప్రవర్తించింది. తన ప్రేమను కాదన్నాడని అతడి భార్యపై ఘాతుకానికి పాల్పడింది. మహాత్మాగాంధీ నగర్‌లో నివసిస్తున్న నాగరాజు అనే వ్యక్తిని రేష్మా అనే యువతి ప్రేమించింది. అయితే… అతడికి ఇదివరకే పెళ్లయిన విషయం తెలుసుకుని అతడి భార్యపై పగ పెంచుకుంది. తన ప్రేమకు నాగరాజు భార్య మహేశ్వరి అడ్డుగా ఉందని భావించిన రేష్మా… ఆమెపై బ్లేడుతో దాడి చేసింది. గర్భిణీ అనే కనికరం లేకుండా గొంతు కోసింది.

ఈ దాడిలో మహేశ్వరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహేశ్వరి గొంతుకి 36 కుట్లు వేశామని డాక్టర్లు తెలిపారు. మహేశ్వరికి 9 నెలల చిన్నారి కూడా ఉంది. మహేశ్వరి ప్రస్తుతం 5 నెలల గర్భిణి.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వివాహితుడిని ప్రేమించడమే కాకుండా అతడి భార్యని చంపాలని చూసిన రేష్మా తీరుని స్థానికులు తప్పుపట్టారు. ఆమెని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.