మహిళలు స్నానాలు చేస్తుంటే..రహస్యంగా చిత్రీకరించాడు..తర్వాత

మహిళలు స్నానం చేస్తున్న సందర్భంలో వీడియోలు తీసి పైశాచికానందం పొందుతున్నారు కొందరు దుర్మార్గులు. ఇటీవలే పలు ఘటనలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లయిన ఓ యువకుడు ఇలాగే చేసి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన కొండాపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఖమ్మం ప్రాంతానికి చెందిన ఫణీందర్ (30) కొంతకాలం క్రితం కొండాపూర్‌కు వలస వచ్చాడు.
MBA చదివాడు. ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి పెళ్లి కూడా అయ్యింది. భార్యతో కలిసి మసీద్ బండ్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే..వీరు ఉంటున్న ఇంటికి ఆనుకుని మరో ఇళ్లు ఉంది. బాల్కనీ ఎక్కి చూస్తే..పక్కింటి బాత్ రూం కనిపిస్తుంది. ఫణీందర్..బాల్కానీ ఎక్కి..ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో నుంచి స్నానం చేస్తున్న మహిళలను చూసేవాడు. అంతేగాకుండా..సెల్ ఫోన్‌లో వీడియోలు తీసి వికృతానందం పొందేవాడు. రెండు రోజుల క్రితం అలా వీడియో తీస్తుండగా..మహిళ కంటపడింది. వెంటనే కుటుంసభ్యులకు తెలిపింది. వెంటనే ఫణీందర్‌కు దేహశుద్ధి చేసి..పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతని సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని..అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read More : మామ వేధింపులు..కోడలు ఆత్మహత్య