బ్రేకింగ్ : మాజీ న్యాయమూర్తి ఇంట్లో వరకట్న వేధింపులు

హైదరాబాద్ : న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయమూర్తి ఇంట్లోనే ఓ మహిళకు రక్షణ లేకుండా పోయింది. గృహ హింస వేధింపుల తో అత్త, భర్త దాడి చేసారని ఆ ఇంటి కోడలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ లోనివాసం ఉండే మాజీ న్యాయమూర్తి నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మపై ఈ దారుణం జరిగింది. ఆమెపై భర్త వశిష్ట, అత్త విజయలక్ష్మి దాడి చేశారని ఆరోపిస్తూ సీసీఎస్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు భర్త, అత్తలపై ఐపీసీ 498 ఏ, 406, 323, సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.