కట్టుకున్న భార్యను కడతేర్చాడు : మూడు నెలల గర్భిణీ హత్య

హైదరాబాద్ : ఆసిఫ్ నగర్ లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. ఆమె తలపై బలంగా కొట్టడంతో కుప్పకూలి పోయింది.. అనంతరం ఆమెను ఉరి తీసి దారుణంగా చంపేశాడు. అనంతరం పోలీసుల ఎదుటు లొంగిపోయాడు. మృతురాలు మూడు నెలల గర్భిణీ.
షాలిని, విజయ్ కుమార్ భార్యాభర్తలు. ఆసిఫ్ నగర్ లో నివాసముంటున్నారు. మృతురాలు షాలిని మూడు నెలల గర్భిణీ. కుటుంబ కలహాల కారణంగా తరుచుగా గొడవపడుతున్నారు. ఈనేపపథ్యంలో భార్య షాలిని నిద్రిస్తున్న సమయంలో ఆమె తలపై విజయ్ కుమార్ బలంగా కొట్టడమే కాకుండా చేతులు కట్టేసి ఆమెను ఉరితీశాడు. దీంతో ఆమె మృతి చెందింది. అనంతరం విజయ్ కుమార్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కుటుంబ కలహాల వల్లనే హత మార్చినట్లు విజయ్ కుమార్ పోలీసులకు చెప్పాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసుల ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి బంధువులు, నిందితుడు విజయ్ కుమార్ వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కుటుంబ కలహాలే కారణమా.. లేక ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.