Hyderabad : మైనర్ బాలికపై వేధింపులు-బాలిక తండ్రి బైక్ దగ్దం

హైదరాబాద్ చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను ఒక యువకుడు ప్రేమించమని వేధించాడు. అందుకు బాలిక అంగీకరించకపోవటంతో ఆ బాలిక తండ్రి బైక్ కి నిప్పుపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Hyderabad : మైనర్ బాలికపై వేధింపులు-బాలిక తండ్రి బైక్ దగ్దం

Chandranagar Police Station

Updated On : June 15, 2022 / 12:56 PM IST

Hyderabad : హైదరాబాద్ చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను ఒక యువకుడు ప్రేమించమని వేధించాడు. అందుకు బాలిక అంగీకరించకపోవటంతో ఆ బాలిక తండ్రి బైక్ కి నిప్పుపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

చందానగర్‌లో  10 వ తరగతి చదివే బాలికను అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ప్రేమ పేరుతో వెంటపడసాగాడు. బాలిక పట్ల  కొన్నిసార్లు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక అతని ప్రేమను అంగీకరించలేదు.  దీంతో ఆగ్రహించిన యువకుడు బాలిక తండ్రి బైక్ పై   పెట్రోల్ పోసి తగలబెట్టాడు. దీంతో వారు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు తీసుకున్న పోలీసులు యువకుడిపై  ఐపీసీ సెక్షన్ 354, పోక్సో చట్టం 11 మరియు 12 మీద కేసు నమోదు చేశారు. కాగా కేసు నమోదు చేసినా యువకుడిని ఇంతవరకు  అరెస్ట్ చేయలేదని బాలిక తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు.  అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి నోటీసులు ఇచ్చి కేసు దర్యాప్తు చేస్తున్నామని… తప్పు ఉందని తేలితే శిక్షిస్తామని చందానగర్ పోలీసు స్టేషన్ సబ్ ఇనస్పెక్టర్ క్యాస్ట్రో తెలిపారు.

Also Read : Hyderabad : పాతబస్తీలో బైక్ లతో యువకులు ర్యాష్ డ్రైవింగ్..ప్రశ్నించిన యువకుడిపై దాడి