వివాహితతో అక్రమ సంబంధం….దారుణ హత్య 

  • Published By: murthy ,Published On : May 20, 2020 / 09:20 AM IST
వివాహితతో అక్రమ సంబంధం….దారుణ హత్య 

Updated On : May 20, 2020 / 9:20 AM IST

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో రాజేందర్  అనే యువకుడిని రమేష్ అనే వ్యక్తి తన సోదరుడు మహేష్ తో కలిసి గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. రెండు నెలల క్రితం ఒకసారి హత్యాయత్నం చేయగా మృతుడు తృటిలో తప్పించుకున్నాడు. కానీ మంగళవారం రెండోసారి నిందితులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి మండలం, వేంపేట లో ఈ దారుణం జరిగింది. 

వేంపేట గ్రామానికి చెందిన దనరేకుల రాజేందర్ (28) అనే యువకుడు ఉపాధిహామీ పధకంలో మేట్ గా పని చేస్తున్నాడు. అతనికి భార్య హరిణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.  రాజేందర్ కు అదే గ్రామానికి చెందిన జెల్ల రమేష్ అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. జెల్ల రమేష్, అతని సోదరుడు మహేష్ తో కలిసి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారు. వీరి బంధానికి అడ్డుచేప్పేవారు ఎవరూ లేకపోవటంతో రాజేందర్ వివాహేతర సంబంధం కొన్నాళ్లు గుట్టుగా సాగింది. 

తన భార్య వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న రమేష్, తన తమ్ముడు మహేష్ తో కలిసి కొద్ది నెలల క్రితం గల్ఫ్ నుంచి తిరిగి గ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి రాజేందర్ పై కక్ష పెంచుకున్నాడు. ఈ సంవత్సరం మార్చి 3న  మెట్ పల్లి శివారులో పెట్రోల్ బంక్ వద్ద రాజేందర్ పై అన్నదమ్ములిద్దరూ హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో రాజేందర్ స్వల్ప గాయాలతో బయటపడి ప్రాణం దక్కించుకున్నాడు. 

హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రమేష్,మహేష్ లను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇటీవలే అన్నదమ్ములిద్దరూ  బెయిల్ పై బయటకు వచ్చారు. పగ చల్లారని అన్నదమ్ములు రాజేందర్ కదలికలపై  ఓ కన్నేసి ఉంచారు. 

ఈ క్రమంలో మంగళవారం మే19  గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఉదయం 11-30 సమయంలో  ఉపాధి హమీ పనులకు కూలిగా వచ్చిన తన తల్లిని  ఇంటి వద్ద దింపి తిరిగి పనులుజరుగుతున్న ప్రదేశానికి తిరిగి వచ్చాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన  రమేష్, మహేష్ లు రాజేందర్ పై గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన రాజేందర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.  

సమచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి చేరుకున్న డీఎస్పీ గౌసుబాబా, సీఐ రవికుమార్, ఎస్సై çసుధాకర్‌ గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.  రాజేందర్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read: ప్రేమంటే ఇదేనా: ఒకప్పటి ప్రేమికులు..రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య