Tamil Actress Deepa Suicide : తమిళ యువ నటి దీప ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?

తమిళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్‌ యువ నటి దీప ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని విరుగంబాక్కంలోని తన ఫ్లాట్‌లో దీప ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. దీప ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tamil Actress Deepa Suicide : తమిళ యువ నటి దీప ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?

Tamil Actress Deepa Suicide

Updated On : September 18, 2022 / 4:31 PM IST

Tamil Actress Deepa Suicide : తమిళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్‌ యువ నటి దీప ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని విరుగంబాక్కంలోని తన ఫ్లాట్‌లో దీప ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. గత కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న దీప.. మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని స్నేహితులు చెప్తున్నారు. దీపతో మాట్లాడడానికి ఆమె కుటుంబసభ్యులు ఫోన్‌ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులకు దీప స్నేహితుడికి సమాచారం అందించారు.

దీంతో ఆమె స్నేహితుడు ఫ్లాట్‌కి వెళ్లి చూడగా.. దీప ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.. వెంటనే దీప స్నేహితుడు పోలీసులతో పాటు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీప ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tollywood : టాలీవుడ్ లో విషాదం.. సినిమా పై కలలు.. అంతలోనే ఆత్మహత్య..

ఆమె ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్‌ నోట్‌ లభించినట్లు తెలుస్తోంది. అందులో తన చావుకు ఎవరు కారణం కాదని చెబుతూనే జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటా అని రాసినట్లు సమాచారం. అయితే, దీప పలు తమిళ సినిమాల్లో సహాయ నటిగా నటించి అలరించింది. చిన్న పాత్రలు పోషించినా.. తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.