పెళ్లైన విషయం దాచిపెట్టి యువతితో ప్రేమాయణం- అది తెలిసి యువతి ఆత్మహత్య

Young Lady Suicide
young woman ends life, man duped her love ,khammam district : పెళ్లైన ఆటోడ్రైవర్ బట్టల కొట్టులో పనిచేసే ఒక యువతిని ప్రేమించాడు. తన ప్రియుడికి పెళ్లైన సంగతి తెలుసుకున్న ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా మాలబంజర గ్రామానికి చెందిన తంబర్ల రత్నకుమారి(24) ఖమ్మంలోని ఒక బట్టలదుకాణంలో పని చేస్తోంది. ఆమెకు ఖమ్మం చర్చి కాపౌండ్ కు చెందిన ఆటో డ్రైవర్ కర్రి సంజయ్ తో పరిచయం ఏర్పడింది.
సంజయ్ కు అంతకు ముందే వివాహం అయినా ఆ విషయం దాచిపెట్టి ఆమెతో ప్రేమ వ్యవహారం నడిపాడు. కొన్నాళ్లకు ఈవిషయం రత్నకుమారికి తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి ఈనెల9న తన స్వగ్రామానికి వచ్చింది. 10వ తేదీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మంప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసింది. మృతురాలి బాబాయ్ తంబళ్ల స్వామిదాసు ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ సంజయ్, రత్నకుమారిపై బెదిరింపులకు పాల్పడ్డ అతని బావమరిది కొత్తగూడేనికి చెందిన చిన్నపాక కరుణ ప్రకాశ్ లపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.