Gang Rape In Telangana : మహబూబాబాద్ జిల్లాలో గ్యాంగ్ రేప్

మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న యువతిపై నలుగురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఘటన వెలుగు చూసింది.

Gang Rape In Telangana : మహబూబాబాద్ జిల్లాలో గ్యాంగ్ రేప్

Gang Rape In Telangana

Updated On : February 23, 2022 / 1:56 PM IST

Gang Rape In Telangana :  మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న యువతిపై నలుగురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. ఆలేరు గ్రామానికి చెందిన యువతి(23) ఒంటరిగా ఉన్న సమయంలో గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ అవమానం భరించలేని యువతి …తనపై నలుగురు గ్యాంగ్ రేప్ చేసారని  వారిపేర్లు తెలుపుతూ సూసైడ్ నోట్ రాసి ఈనెల 18వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అది గమనించిన బంధువులు ఆమెను వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించసాగారు.
Also Read : Karmanghat : నిందితులను అరెస్టు చేయాలి, గోరక్షక్ సభ్యులపై కేసులను ఎత్తివేయాలి
కాగా…. పరిస్ధితి విషమించటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలోనే   ఉంచి   బందోబస్తు నిర్వహిస్తున్నారు. గ్యాంగ్ రేప్ విషయం బయటకు పొక్కకుండా గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.