Marijuana In Parigi : పరిగిలో గంజాయి కలకలం

వికారాబాద్ జిల్లా పరిగిలో గంజాయి కలకలం రేగింది. శాంతినగర్ కు చెందిన నలుగురు చిన్నారులు రాత్రి పడుకొని ఉదయం ఎంతసేపటికి నిద్రలేవక  పోవడంతో వారి తల్లిదండ్రులు నీళ్ళు పోసి లేపారు.

Marijuana In Parigi : పరిగిలో గంజాయి కలకలం

Marijuana In Parigi,

Updated On : July 7, 2021 / 9:52 PM IST

Marijuana In Parigi : వికారాబాద్ జిల్లా పరిగిలో గంజాయి కలకలం రేగింది. శాంతినగర్ కు చెందిన నలుగురు చిన్నారులు రాత్రి పడుకొని ఉదయం ఎంత సేపటికి నిద్ర లేవకపోవడంతో వారి తల్లిదండ్రులు నీళ్ళు పోసి లేపారు. ఎందుకిలా ఇంతసేపు నిద్రపోయారని చిన్నారులను వారి తల్లిదండ్రులు ప్రశ్నించగా బిత్తరపోయే సమాధానం చెప్పారు. తెలియక సిగరెట్ తాగామని …దాంతో నిద్రవచ్చి పడుకున్నామని చిన్నారులు చెప్పారు.

కాలనీలో ఉన్న కల్లు కంపౌండ్‌కు చెందిన ఓ మైనర్ బాలుడు తమతో సిగరెట్ తాగించాడనే విషయం వారు తల్లిదండ్రులకు చెప్పారు. కాలనీ వాసులంతా కలిసి ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఎక్సైజ్ పోలీసులు సిగరెట్ తాగించిన బాలుడ్ని  ప్రశ్నించారు. సిగరెట్లు తాగించింది నిజమేనని వారి ముందు ఒప్పుకున్నాడు. అనంతరం ఎక్సైజ్ పోలీసులు కల్లు కాంపౌండ్ ను సీజ్ చేసారు.