Male Employee Hugging Female Employee Fine : మహిళా ఉద్యోగిని కౌగిలించుకున్న మగ సహోద్యోగికి రూ.లక్షకుపైగా జరిమానా

ఓ కంపెనీలో పనిచేస్తున్న మగ ఉద్యోగి.. తోటి మహిళా ఉద్యోగిని కౌగిలించుకున్నందుకు కోర్టు రూ.1.16 లక్షలు జరిమానా విధించింది. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. యూయాంగ్ సిటీలోని ఒక కంపెనీలో పనిచేసే మహిళ..సహోద్యోగితో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన మగ సహోద్యోగి.. ఆమెను చాలా బలంగా వెనుక నుంచి కౌగిలించుకున్నాడు.

Male Employee Hugging Female Employee Fine : మహిళా ఉద్యోగిని కౌగిలించుకున్న మగ సహోద్యోగికి రూ.లక్షకుపైగా జరిమానా

Male Employee Hugging Female Employee Fine (1)

Updated On : August 17, 2022 / 9:41 PM IST

Male Employee Hugging Female Employee Fine : ఓ కంపెనీలో పనిచేస్తున్న మగ ఉద్యోగి.. తోటి మహిళా ఉద్యోగిని కౌగిలించుకున్నందుకు కోర్టు రూ.1.16 లక్షలు జరిమానా విధించింది. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. యూయాంగ్ సిటీలోని ఒక కంపెనీలో పనిచేసే మహిళ..సహోద్యోగితో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన మగ సహోద్యోగి.. ఆమెను చాలా బలంగా వెనుక నుంచి కౌగిలించుకున్నాడు. అతను ఎంత గట్టిగా కౌగిలించుకున్నాడంటే సదరు మహిళ నొప్పితో పెద్దగా అరిచింది.

అతని పట్టు నుంచి తప్పించుకున్న తర్వాత కూడా ఆమెకు ఛాతీ భాగంలో నొప్పిగానే అనిపించింది. ఇంటికి వెళ్లిన తర్వాత వేడి నూనెతో ఆమె మర్దన చేసుకుంది. అయినా నొప్పి తగ్గలేదు. అదే తగ్గుతుందిలే అని వదిలేసింది. అయితే ఐదు రోజులు గడిచినా కూడా నొప్పి ఏమాత్రం తగ్గలేదు. దాంతో ఆస్పత్రికి వెళ్లగా.. ఎక్స్‌రేలో ఆమె ఛాతీ భాగంలో మూడు పక్కటెముకలు విరిగినట్లు తేలింది. కుడివైపు రెండు, ఎడమ వైపు రెండు రిబ్స్ విరిగాయని డాక్టర్లు పేర్కొన్నారు. దాంతో ఆమె ఆఫీసుకు రాలేక సెలవు పెట్టింది.

Gurugram Club: క్లబ్బులో మహిళతో బౌన్సర్ల అసభ్య ప్రవర్తన… ప్రశ్నించినందుకు దాడి.. వీడియో వైరల్‌

ఈ సమయంలో ఆమెకు జీతం కూడా రాలేదు. దానికితోడు ఆస్పత్రి ఖర్చులు కూడా నెత్తినపడ్డాయి. ఈ నేపథ్యంలో తన గాయానికి కారణమైన మగ సహోద్యోగిని కలిసి తనకు అతని వల్లనే గాయమైందని, కాబట్టి ఆస్పత్రి ఖర్చులు ఇవ్వాలని ఆమె కోరింది. దానికి అతను నిరాకరించాడు. తన కౌగిలి వల్లనే ఎముకలు విరిగినట్లు సాక్ష్యం ఏంటన్నాడు.

దీంతో మహిళ యూంషీ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆఫీసు ఘటన తర్వాత ఆ యువతి ఎముకలు విరిగేంతటి పని ఏదీ చేసినట్లు కనిపించడం లేదని పేర్కొంది. దీంతో ఆమెకు 10 వేల యువాన్లు (సుమారు రూ.1.16 లక్షలు) చెల్లించాలని గట్టిగా కౌగిలించుకున్న మగ సహోద్యోగిని ఆదేశించింది.