Hyderabad NIMS : హైదరాబాద్ నీమ్స్ లో పలు కోర్సుల్లో ప్రవేశాలు

అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రారంభ తేదీ 13 జూలై, 2022 కాగా, దరఖాస్తు చివరి తేదీ : 01ఆగస్టు, 2022 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://nims.edu.in/ను సంప్రదించగలరు.

Hyderabad NIMS : హైదరాబాద్ నీమ్స్ లో పలు కోర్సుల్లో ప్రవేశాలు

Hyderabad Nims

Updated On : July 18, 2022 / 2:15 PM IST

Hyderabad NIMS : హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 2022 సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ పారా మెడికల్ సంబంధిత హెల్త్ సైన్సెస్ కోర్సులు, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీ (బీపీటీ) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. హెల్త్ సైన్సెస్ కోర్సులకు సంబంధించి న్యూరో టెక్నాలజీ, డయాలసిస్‌, కార్డియోవాస్కులర్‌, ఎమర్జెన్సీ అండ్‌ ట్రామాకేర్‌, రేడియో థెరఫీ, మెడికల్‌ ల్యాబరేటరీ టెక్నాలజీఅనస్థీషియా, పెర్ఫ్యూజన్‌ టెక్నాలజీ, రేడియేషన్‌ థెరఫీ, రెసిపిరేటరీ థెరఫి అండ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ వంటి కోర్సులు ఉన్నాయి.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్‌ మార్కుల ప్రాతిపదికన సీట్లు భర్తీ చేయనున్నారు. సీట్ల సంఖ్యకు సంబంధించి బీఎస్సీ నర్సింగ్ 100, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీ  50, పారా మెడికల్ సంబంధిత హెల్త్ సైన్సెస్ కోర్సులు 100 సీట్లు ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ 100 సీట్లు మహిళలు మాత్రమే అర్హులు. పారా మెడికల్ సంబంధిత హెల్త్ సైన్సెస్ కోర్సులు 100 సీట్లు నాలుగేళ్ల వ్యవధిత ఈ కోర్సు ఉంటుంది. ఇందులోనే ఏడాది పాటు ఇంటర్న్ షిప్ ఉంటుంది. ఇంటర్ బైపీసీ అర్హతగా నిర్ణయించారు.

అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రారంభ తేదీ 13 జూలై, 2022 కాగా, దరఖాస్తు చివరి తేదీ : 01ఆగస్టు, 2022 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://nims.edu.in/ను సంప్రదించగలరు. దరఖాస్తు హార్ట్ కాపీలను పంపాల్సిన చిరునామా ; అసోసియేట్ డీన్, అకడమిక్-2, రెండవ అంతస్తు, పాత ఓపీడీ బ్లాక్, నీమ్స్,పంజాగుట్ట, హైదరాబాదు-500082.