IIS బెంగళూరు : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ప్రవేశాలు

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISC) 2019-20 విద్యా సంవత్సరానికి వివిద కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా రిసెర్చ్ ప్రోగ్రామ్, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ, PHD, ERP ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పించనున్నారు.
* దరఖాస్తు ఫీజు:
– దరఖాస్తు ఫీజుగా జనరల్, OBC అభ్యర్థులు రూ.800 చెల్లించాలి.
– SC, ST అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.
– ERP ప్రోగ్రామ్‌కు రూ.2000 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
* ERP ప్రోగ్రామ్ (ఎక్స్‌టర్నల్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్):
– ఏదైనా సంస్థలో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్ (ఆర్ అండ్ డీ, ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మాస్యూటికల్, వెటర్నరీ)
* ఎంపిక విధానం:
– ప్రవేశ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
* కోర్సులు:
– PHD ఇన్ సైన్స్, ఎంటెక్ రిసెర్చ్ అండ్ PHD ఇన్ ఇంజినీరింగ్, PHD ఇన్ ఇంటర్ డిసిప్లెనరీ.
* అర్హులు:
– గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్, టెక్నాలజీ, సైన్స్).
– మాస్టర్స్ డిగ్రీ (సైన్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ, సైకాలజీ, కామర్స్, ఆపరేషన్స్ రిసెర్చ్, కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్).
– BE, B- TECH, MSC తర్వాత MS,MBA చదివి ఉండాలి.
– గేట్, నెట్ JRF లో అర్హత తప్పనిసరి.
* దరఖాస్తుకు చివరితేది: 25.03.2019.