AP Degree Admissions: ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల.. ఆగస్ట్ 18 నుంచి రిజిస్ట్రేషన్స్.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు

AP Degree Admissions: ఏపీలో డిగ్రీ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలయ్యింది. దీనిని సంబందించిన షెడ్యూల్ ను విద్యా మండలి ఖరారు చేసింది.

AP Degree Admissions: ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల.. ఆగస్ట్ 18 నుంచి రిజిస్ట్రేషన్స్.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు

Andhra Pradesh State Council of Higher Education releases schedule for degree admissions

Updated On : August 3, 2025 / 10:17 AM IST

ఏపీలో డిగ్రీ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలయ్యింది. దీనిని సంబందించిన షెడ్యూల్ ను విద్యా మండలి ఖరారు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఆగస్ట్ 18వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబందించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx ద్వారా తెలుసుకోవచ్చు.రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా ఆగస్ట్ 18వ తేదీ నుంచే ప్రారంభించి 20వ తేదీ వరకు అవకాశం కల్పించనుంది. ధ్రువపత్రాల పరిశీలన ఆగస్ట్ 21 నుంచి 23వ తేదీ వరకు జరుగనుంది. ఆగస్ట్ 21 నుంచి 24వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి.

ఆగస్ట్ 25వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ అవకాశం ఉంటుంది. విద్యార్థుల మార్కులు, వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఆగస్ట్ 27వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆగస్ట్ 28 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. కాబట్టి, విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.