AP TET Admit Cards : ఏపీ టెట్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా?
AP TET Admit Cards 2024 : ఏపీ టెట్ పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Andhra Pradesh TET Admit Card 2024 Released
AP TET Admit Cards 2024 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ, ఏపీటెట్ 2024 అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (aptet.apcfss.in)ని విజిట్ చేయడం ద్వారా తమ హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డును యాక్సెస్ చేయడానికి అభ్యర్థి ఐడీ, పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి. పరీక్ష అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు (సెషన్ 1), మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు (సెషన్ 2) జరుగనుంది. అలాగే, ఫైనల్ రిజల్ట్ నవంబర్ 2న వెలువడనుంది.
ఏపీ టెట్ అడ్మిట్ కార్డ్ 2024 డౌన్‌లోడ్ చేయాలంటే? :
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ (aptet.apcfss.in)కి వెళ్లండి.
- హోమ్‌పేజీలో “హాల్ టిక్కెట్” లింక్‌పై క్లిక్ చేయండి
- మీ అభ్యర్థి ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్‌ని ఎంటర్ చేసి లాగిన్ చేయండి
- మీ అడ్మిట్ కార్డ్‌ని చెక్ చేసి, సేవ్ చేయండి
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం హాల్ టికెట్ ప్రింటవుట్ తీసుకోండి
ఏపీ టెట్ 2024 పరీక్షా విధానం :
ఏపీ టెట్ 2024 మోడల్ 2 గంటల 30 నిమిషాల పాటు కొనసాగుతుంది. 150 మల్టీ-ఆప్షనల్ ప్రశ్నలు (MCQ) ఉంటాయి.
రెండు పేపర్లతో పరీక్ష :
పేపర్ 1లో మొత్తం 5 సెక్షన్లు ఉన్నాయి. చైల్డ్ డెవలప్‌మెంట్, పెడాగోజీ, లాంగ్వేజ్ 1, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 2లో 5 సెక్షన్లు ఉన్నాయి. చైల్డ్ డెవలప్‌మెంట్, పెడాగోజీ, లాంగ్వేజ్ 1, ఇంగ్లీష్, ఎంచుకున్న స్ట్రీమ్‌కు సంబంధించిన సబ్జెక్టులు. మొదటి మూడు సెక్షన్లలో ఒక్కొక్కటి 30 మల్టీ-ఆప్షన్ల ప్రశ్నలు ఉంటాయి. చివరి సెక్షన్‌లో 60 ప్రశ్నలు ఉంటాయి.
ఏపీటెట్ పరీక్ష అనేది రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు, ఏపీ మోడల్ పాఠశాలలు, సంక్షేమ, సమాజ పాఠశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు, ఆంధ్రప్రదేశ్ నియంత్రణలో ఉన్న ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలతో సహా అన్ని నిర్వహణల పరిధిలోని పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8 తరగతుల ఉపాధ్యాయులుగా చేరాలనుకునే అభ్యర్థుల కోసం ఈ టెక్ పరీక్షను నిర్వహిస్తారు.