AP Mega DSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నేడే మెగా డీఎస్సీ నోటిఫికేషన్
జూన్ 6 నుంచి జూలై వరకు సీబీటీ విధానంలో ఎగ్జామ్స్ ఉంటాయి.

AP Mega DSC: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఆదివారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 16వేల 347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆదివారం నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. జూన్ 6 నుంచి జూలై వరకు సీబీటీ విధానంలో ఎగ్జామ్స్ ఉంటాయి.
ఆదివారం ఉదయం 10 గంటలకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం. https://cse.ap.gov.in, https://apdsc.apcfss.in వెబ్ సైట్ల ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టీచర్ల నియామకం ద్వారా స్కూళ్ల సాధికారత సాధించడంలో ఇదొక చారిత్రక ముందడుగు అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
Also Read : ఏపీ నుంచి రాజ్యసభ లక్కీ ఛాన్స్ ఎవరిది? కేంద్రమంత్రిగా అన్నామలైని తీసుకునే ఛాన్స్?
* మెగా డీఎస్సీ షెద్యూల్ ప్రకటించిన మంత్రి నారా లోకేశ్
* 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చేందుకు మెగా డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయo.
* ఏప్రిల్ 20వ తేదీన మెగా డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల.
* ఉపాధ్యాయ అభ్యర్ధులు ఏప్రిల్ 20వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
* జూన్ 6వ తేదీ నుండి జులై 6 వ తేదీ వరకు సీబీటీ విధానంలో పరీక్షలు
* మెగా డీఎస్సీ -2025 పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూల్, సిలబస్, నోటిఫికేషన్, హెల్ప్ డెస్క్ వివరాలు 20.04.2025 ఉదయం 10 గంటల నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి.
అటు క్రీడా పాలసీ 2024-29 లో భాగంగా క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల్లో 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ కల్పిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోలీస్, ఎక్సైజ్, అటవీ శాఖల్లో క్రీడాకారులకు 3 శాతం స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్ కల్పించారు. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వం. ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లలో రాత పరీక్ష లేకుండానే రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ ద్వారా స్పోర్ట్స్ కోటాలో నియామకం జరిగేలా మార్గదర్శకాలు జారీ చేసింది.
రెండు కేటగిరీలో 65 రకాల క్రీడలను గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్ షిప్ లు, కామన్ వెల్త్ క్రీడలు, వరల్డ్ కప్, జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడా కారులకు వాటి ఆధారంగా ఆయా గ్రేడ్ ఉద్యోగాలు కేటాయించేలా మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here