AP Inter Supplementary Results: రేపే ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి

ఇంటర్ విద్యార్థులకు ఆంద్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల విడుదల తేదీని ప్రకటించింది.

AP Inter Supplementary Results: రేపే ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి

Inter supply results 2025

Updated On : June 6, 2025 / 2:29 PM IST

ఇంటర్ విద్యార్థులకు ఆంద్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల విడుదల తేదీని ప్రకటించింది. జూన్ 07 ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటన చేసింది. ఈ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్, మనమిత్ర 9552300009 వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు అని సూచించారు.

వెబ్ సైట్ లో ఇలా చెక్ చేసుకోండి:
ముందుగా వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ లోకి వెళ్ళండి
హోమ్‌ పేజీలో ‘AP IPE ఫలితాలు 2025’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
తర్వాత ఇంటర్ 1వ సంవత్సరం లేదా 2వ సంవత్సరం ఫలితాలపై క్లిక్ చేయండి.
విద్యార్థి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి.
తరువాత ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

వాట్సాప్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి:
ముందుగా ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు ‘Hi’ అని మెసేజ్ చేయండి.
ఆ తర్వాత ‘సెలెక్ట్ సర్వీస్’ లో ‘విద్యా సేవలు’ సెలెక్ట్ చేసుకోవాలి.
డౌన్‌లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు- 2025 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
తరువాత ‘హాల్ టికెట్’ నెంబర్‌ను ఎంటర్ చేయగానే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.