AP Mega DSC Final Key: మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
త్వరలోనే డీఎస్సీ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ నెల మూడో వారంలో డీఎస్సీ కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే

AP Mega DSC Final Key: ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదలైంది. అధికారిక వెబ్ సైట్ లో కీ ని అందుబాటులో ఉంచారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక ‘కీ’ విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరించారు. ఈ అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి తుది ‘కీ’ రూపొందించారు. ఫైనల్ ‘కీ’ పై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించడం లేదని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. కీ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో(https://apdsc.apcfss.in/) తమ వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16వేల 347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 3లక్షల 36వేల 307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 6 నుంచి జులై 2 వరకు 23 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి రెండు సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహించారు. మెగా డీఎస్సీ పరీక్షలకు 92.90 శాతం మంది హాజరయ్యారు.
ఇక, త్వరలోనే డీఎస్సీ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ నెల మూడో వారంలో డీఎస్సీ కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే నెల 5న కొత్త టీచర్లకు పోస్టింగ్ ఇవ్వనున్నారని సమాచారం.
* AP DSC అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in ని సందర్శించండి.
* హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న AP DSC ఫైనల్ ఆన్సర్ కీ లింక్‌పై క్లిక్ చేయండి.
* అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
* సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఫైనల్ ఆన్సర్ కీ ప్రదర్శించబడుతుంది.
* ఫైనల్ ఆన్సర్ కీని తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.
* తదుపరి అవసరాల కోసం హార్డ్ కాపీని మీ వద్ద ఉంచుకోండి.
Also Read: ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్.. 10277 ఖాళీలు, రూ.24 వేల జీతం.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు