AP Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ -2025 నోటిఫికేషన్‌ విడుదల.. పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూల్.. సిలబస్ పూర్తి వివరాలు ఇలా..

రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదలైంది.

AP Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ -2025 నోటిఫికేషన్‌ విడుదల.. పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూల్.. సిలబస్ పూర్తి వివరాలు ఇలా..

AP DSC

Updated On : April 20, 2025 / 11:09 AM IST

AP Mega DSC: రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉదయం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్ లైన్ లోనే దరఖాస్తులు, ఫీజు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని అభ్యర్థులకు సూచించారు.

 

ఇదిలాఉంటే.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం ‘ఎక్స్’ ద్వారా మెగా డీఎస్సీ షెడ్యూల్ ను విడుదల చేశారు. అయితే, మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూల్, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఇవాళ ఉదయం అందుబాటులో ఉంచినట్లు డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ http://apdsc.apcfss.in/# ను సందర్శించాలని సూచించారు.

 

షెడ్యూల్ ఇలా..
◊ ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.
◊ మే 15వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు ముగియనున్న గడువు
◊ మే 20వ తేదీ నుంచి మాక్ టెస్టుల నిర్వహణ
◊ మే 30వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ ప్రారంభం
◊ జూన్ 6 నుంచి జులై 6వరకు పరీక్షలు
◊ అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక ‘కీ’ విడుదల.
◊ తరువాత ఏడు రోజులపాటు అభ్యంతరాలు స్వీకరణ.
◊ అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది ‘కీ’ విడుదల
◊ ఆ తరువాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటన

 

డీఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్ట్ లింక్స్ ఇవే..
♦  https://cse.ap.gov.in
♦ https://apdsc.apcfss.in

 

మెగా డీఎస్సీలో భాగంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి.

జిల్లా స్థాయి పోస్టులు ఇలా..
ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,192 ఖాళీల్లో ఎస్జీటీలు 5,985 ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 1,817, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 106 ఉన్నాయి. వీటిలో సబ్జెక్టు టీచర్ పోస్టులు సాంఘీక శాస్త్రానికి 1,329 ఉండగా.. ఆంగ్ల భాషకు 1,032 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్య ఉపాధ్యాయ పోస్టులు 1,664 భర్తీ చేయనున్నారు. ఎస్ఏ భాష -1కు 534 పోస్టులు, హిందీ 492 పోస్టులు, గణితం 655 పోస్టులు, భౌతికశాస్త్రం 599 పోస్టులు, జీవశాస్త్రం 902 పోస్టులు ఉన్నాయి.

జిల్లా స్థాయిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీలు..
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని పోస్టులను జిల్లా స్థాయిలోనే భర్తీ చేయనున్నారు. వీటిలో మొత్తం 881 పోస్టులు ఉన్నాయి. తెలుగు (13), హిందీ(21), ఇంగ్లీష్ (34), గణితం (55), భౌతికశాస్త్రం (83), జీవశాస్త్రం (44), సాంఘీక శాస్త్రం (24), ఎస్ఏ పీఈటీ(6), ఎస్జీటీ (601) పోస్టులు ఉన్నాయి.

దివ్యాంగుల పాఠశాలల్లో ఖాళీలు..
దివ్యాంగుల పాఠశాలల్లో మొత్తం 31 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటిలో బధిరుల పాఠశాలలో 11, అంధుల పాఠశాలలో 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో బధిరుల పాఠశాలలో టీజీటీ తెలుగు (1), టీజీటీ గణితం(2), టీజీటీ భౌతికశాస్త్రం(2), పీఈటీ (1), ఎస్జీటీ (5) పోస్టులు ఖాళీగా ఉండగా.. అంధుల పాఠశాలలో టీజీటీ హిందీ (3), టీజీటీ భౌతికశాస్త్రం(3), టీజీటీ జీవశాస్త్రం (2), పీఈటీ (2), ఎస్జీటీ (10) పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి.

జువెనైల్ సంక్షేమ విభాగం పాఠశాలల్లో ఖాళీలు వివరాలు ఇలా..
◊ రాష్ట్రంలోని విశాఖపట్టణం, ఏలూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. అందులో ఎస్జీటీ -13, పీఈటీ -2 ఖాళీలు ఉన్నాయి.
◊ విశాఖ పట్టణం జిల్లాలో మొత్తం ఐదు ఖాళీలు ఉన్నాయి. వాటిలో ఎస్జీటీ -4, పీఈటీ -1.
◊ ఏలూరు జిల్లాలో మొత్తం ఏడు ఖాళీలు ఉన్నాయి. వాటిలో ఎస్జీటీ -6, పీఈటీ -1.
◊ వైఎస్ఆర్ జిల్లాలో మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయి. ఎస్జీటీ -3.