ఉద్యోగ సమాచారం : పది పాసైతే.. ఏపీ పోస్టల్ సర్కిల్‌లో ఉద్యోగాలు

విజయవాడ : ఏపీ పోస్టల్ సర్కిల్ 46 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టుల భర్తీలకు దరఖాస్తులను ఆహ్వానించారు.
ఖాళీలు : సర్కిల్ అండ్ అడ్మినిస్ట్రేట్ కార్యాలయంలో 13, సబార్డినేట్ కార్యాలయంలో 33 పోస్టులున్నాయి.
అర్హత : పదో తరగతి లేదా ఐటీఐ పాస్ అయి ఉండాలి.
వయస్సు : 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక : అప్టిట్యూడ్ టెస్టు ఆధారంగా.
పరీక్ష కేంద్రాలు : కర్నూలు, విజయవాడ, విశాఖపట్టణం.
దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీజు రూ. 100, పరీక్ష ఫీజు : రూ. 400 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు రూ. 100)
దరఖాస్తు విధానం : ఆన్ లైన్‌లో
రిజిస్ట్రేషన్‌కి లాస్ట్ డే : ఫిబ్రవరి 28, 2019
పోస్టాఫీసుల్లో ఫీజు చెల్లించడానికి లాస్ట్ డే : మార్చి 05, 2019
దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 08, 2019
వెబ్ సైట్ : www.appost.in