AP Govt Jobs : ఎపిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
శాశ్వత ప్రాతిపదికన చేపట్టనున్న ఈ నియామకాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.

AP Govt Jobs
AP Govt Jobs : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(Recruitment Board) రాష్ట్రంలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
READ ALSO : CAT 2023 : ఐఐఎంలు, బిజినెస్ స్కూళ్లలో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ CAT రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు !
శాశ్వత ప్రాతిపదికన చేపట్టనున్న ఈ నియామకాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను https://dme.ap.nic.in/ వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చు.
READ ALSO : Brinjal Farming : వంగతోటలకు మొవ్వు, కాయతొలుచు పురుగుల బెడద
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ లేదా అందుకు సమానమైన విద్యార్హతను కలిగి ఉండాలి. వయో పరిమితి విషయానికి వస్తే ఓసీ అభ్యర్థులకు 42 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 47 ఏళ్లు , దివ్యాంగులకు 52 ఏళ్లు వయోపరిమితిగా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.500 ఫీజు గా నిర్ణయించారు.
READ ALSO : Paddy Cultivation : వరిలో కాండంతోలుచు పురుగు నివారణ
దరఖాస్తు విధానం ;
అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://dme.ap.nic.in/ను ఓపెన్ చేయాలి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుకు రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో న్యూ అప్లికేషన్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తరువాత ఓపెన్ అయ్యే పేజీలో వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ మీ రిజిస్టర్ ఫోన్ నంబర్ అండ్ మెయిల్ కు వస్తుంది.
వాటి సహాయంతో లాగిన్ అయి.. దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. వాటితోపాటు విద్యార్హత సర్టిఫికేట్లను అప్ లోడ్ చేసిన తర్వాత ఫైనల్ సబ్ మిట్ చేయాలి. భవిష్యత్తు అవసరాలకోసం దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.