APPSC Group 1 Mains : గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

APPSC Group 1 Mains : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ను APPSC విడుదల చేసింది. మే 3న తెలుగు, 4న ఇంగ్లిష్, 5వ తేదీన జనరల్ ఎస్సే, 6న హిస్టరీ, 7న పాలిటీ, కాన్ స్టిట్యూషన్, 8న ఎకానమీ, డెవలప్ మెంట్, 9న సైన్స్, టెక్నాలజీ పరీక్షలు ఉంటాయి. విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంలోని మొత్తం 13 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు.
గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలకు 1,48,881 మంది రిజిస్టర్ చేసుకోగా 72.5శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. ప్రిలిమ్స్ ఫలితాలు ఏప్రిల్ 12, 2024న విడుదలయ్యాయి. కొందరు అభ్యర్థులు మూల్యాంకనంపై పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు వాటిని డిస్మిస్ చేసింది. మెయిన్స్ పరీక్ష మొదట సెప్టెంబర్ 2024కు షెడ్యూల్ చేశారు. తర్వాత మే 3కు వాయిదా వేశారు. తాజాగా కొత్త షెడ్యూల్‌ను APPSC విడుదల చేసింది.
Also Read: దేశం చూపు అమరావతి వైపు.. ప్రధాని మోదీ వరాలు ఇవేనా?