డిసెంబర్ 02 నుంచి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ

  • Published By: madhu ,Published On : October 18, 2019 / 04:12 AM IST
డిసెంబర్ 02 నుంచి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ

Updated On : October 18, 2019 / 4:12 AM IST

డిసెంబర్ 02 నుంచి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగనుంది. 2020, జనవరి 19వ తేదీ వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తారు. సికింద్రాబాద్ ఏఓసీ కేంద్రం ఆధ్వర్యంలో జరిగే ఈ ర్యాలీలో హెడ్ క్వార్టర్స్ యూనిట్ కోటాలో ఔట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్, జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్ మెన్, సోల్జర్ క్లర్క్, (ఓపెన్ కేటగిరి), మ్యూజిషయన్ (ఓపెన్ కేటగిరి) ఖాళీలను భర్తీ చేయనున్నారు. 
AOC కేంద్రంలోని తాఫర్ స్టేడియంలో 2019, నవంబర్ 29 తేదీన ఉదయం 8 గంటలకు స్పోర్ట్స్ ట్రయల్ ఉంటుందని అధికారులు వెల్లడించారు.

> పుట్‌బాల్, బాస్కెట్‌బాల్, ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్‌మెన్ బాక్సింగ్, స్విమ్మింగ్, రెస్టిలింగ్, అథ్లెటిక్స్, కబడ్డి, హ్యాండ్‌బాల్, హాకీలలో ప్రావీణ్యత చూపాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పత్రాలతో హాజరు కావాలి. 
> మ్యూజీషియన్ ఓపెన్ కేటగిరి (మిలటరీ బ్యాండ్ మాత్రమే) కోసం డిసెంబర్ 02న ఉదయం 6 గంటలకు తాఫెర్ స్టేడియంలో హాజరు కావాలి. 
> స్పోర్ట్ మెన్‌కు పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 ఏళ్లలోపు, మ్యూజీషియన్ కోసం పదిహేడున్నర సంవత్సరాల నుంచి 23 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
> మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్ తిరుమలగిరి, ఈస్ట్ మారేడ్ పల్లిలోని ఏఓసీ సెంటర్లలో సంప్రదించవచ్చు. లేదా airawat0804@nic.inలలో సంప్రదించవచ్చు.