నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌

  • Published By: veegamteam ,Published On : May 3, 2019 / 03:15 AM IST
నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌

Updated On : May 3, 2019 / 3:15 AM IST

నేటి నుంచి జరిగే తెలంగాణ ఎంసెట్‌కు హైదరాబాద్‌ జేఎన్‌టీయూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 18 జోన్ల పరిధిలోని 94 కేంద్రాల్లో ఎంసెట్‌  నిర్వహిస్తారు. ఇంజినీరింగ్‌ విభాగంలో లక్షా 42 వేలకు మందికి పైగా విద్యార్థులు హారజరుకానున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. 

తెలంగాణ ఎంసెట్‌కు నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ జెఎన్‌టీయూ ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష నిర్వహించనుంది. మే 3 నుంచి 6వ తేదీ వరకు ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుంది. అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 8,9 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి విడత, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో విడత పరీక్ష జరుగుతుంది. మొత్తం 94 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా… వీటిలో ఏపీలో 11  కేంద్రాలు ఉన్నాయి. ఎంసెట్‌ పర్యవేక్షణకు జేఎన్‌టీయూ పటిష్ట ఏర్పాట్లు చేసింది.

ఎంసెట్‌ రాసేందుకు రెండు లక్షల 17 వేల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్‌ పరీక్షకు లక్షా 42 వేల 218 మంది అప్లై చేశారు. వీరిలో 87 వేల 804 మంది బాలురు ఉన్నారు. అలాగే 54 వేల 410 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి నలుగురు ట్రాన్స్‌ జండర్‌ విద్యార్థులు  కూడా ఇంజినీరింగ్‌ పరీక్ష రాయనున్నారు. అగ్రికల్చర్‌, ఫార్మీసీ కోర్సులకు 74 వేల 981 మంది అప్లై చేశారు. వీరిలో 51 వేల 664 మంది బాలికలు, 23 వేల 316 మంది బారులు ఉన్నారు. పకడ్బందీగా ఎంసెట్‌ నిర్వహించేందుకు జేఎన్‌టీయూ చర్యలు చేపట్టింది. 

ఎంసెట్‌ రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని జేఎస్‌టీయూ అధికారులు కోరారు. ఒక్క నిమిషం ఆస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకెళ్లకూడదు. మాస్‌  కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు హెచ్చరించారు. ఆన్‌లైన్‌ పరీక్ష కావడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించారు. జేఎన్‌టీయూ వెబ్‌ సైట్‌లో మాక్‌ టెస్ట్‌లు పొందుపరిచారు. ఆన్‌లైన్‌లో ఎంసెట్‌ నిర్వహించడం ఇది రెండవసారి.