Bank of Maharashtra Recruitment 2025: నెలకు రూ. 1.5 లక్షల వరకు సంపాదించే అవకాశం! పూర్తి వివరాలు ఇవే!

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారుల కోసం ఒక అద్భుతమైన ఉద్యోగ ప్రకటన చేసింది.

Bank of Maharashtra Recruitment 2025: నెలకు రూ. 1.5 లక్షల వరకు సంపాదించే అవకాశం! పూర్తి వివరాలు ఇవే!

Bank of Maharashtra Recruitment 2025

Updated On : June 30, 2025 / 12:56 PM IST

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారుల కోసం ఒక అద్భుతమైన ఉద్యోగ ప్రకటన చేసింది. 2025-26 సంవత్సరానికి గాను ‘ఇంటర్నల్ ఓంబుడ్స్‌మన్(Internal Ombudsman)’ పోస్టును అగ్రిమెంట్ బేసిస్ లో భర్తీ చేయనుంది. ఈ పోస్టుకు ఎంపికైన వారికి మంచి జీతంతో పాటు ఇతర భత్యాలు కూడా అందించనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యా అర్హత: భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

అనుభవం: ఇతర బ్యాంకులలో లేదా ఆర్థిక నియంత్రణ సంస్థలలో జనరల్ మేనేజర్ (GM) స్థాయిలో పనిచేసి రిటైర్ అయినవారు మాత్రమే అర్హులు. బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్, రూల్స్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ వంటి రంగాలలో కనీసం 7 సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్య గమనిక: అభ్యర్థులు గతంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పనిచేసి ఉండకూడదు.

వేతన వివరాలు: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,00,000 జీతం ఉంటుంది. ప్రయాణ ఖర్చుల కోసం రూ.20,000, టెలిఫోన్ బిల్లు రూ. 5,000, ఇంటి అద్దె కోసం రూ.25,000 (లేదా బ్యాంక్ క్వార్టర్స్ సౌకర్యం) ఇస్తారు.

ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక పూర్తిగా వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది అభ్యర్థిని ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: అర్హతగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://bankofmaharashtra.in/current-openings ద్వారా అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ: 03.జులై.2025

దరఖాస్తు రుసుము: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1,180 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

కావలసిన దృవపత్రాలు: విద్యార్హత సర్టిఫికెట్లు, అనుభవ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో