Best Career options: బీటెక్ తరువాత చేయగలిగే బెస్ట్ కోర్సులు.. ఉద్యోగ అవకాశాలు.. ఫుల్ డీటెయిల్స్
Best Career options: ఇంజినీరింగ్ చదివిన కొంతమంది ఉన్నత విద్య వైపు వెళ్లాలనుకుంటారు, మరికొందరు జాబ్ చేయాలని అనుకుంటారు.

Career options after b tech
ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులకు మార్కెట్ లో ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది ఉన్నత విద్య వైపు వెళ్లాలనుకుంటారు, మరికొందరు జాబ్ చేయాలని అనుకుంటారు. కొంతమంది ఈ రెండిటి మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి వారికోసం ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? బీటెక్ తరువాత ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బీటెక్ తరువాత చేయగలిగే బెస్ట్ కోర్సులు:
- బీటెక్ తరువాత ME/M.Tech లాంటి చదువులు మంది ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇందుకోసం GATE ఎక్జామ్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తయ్యాక Teaching jobs, R&D విభాగాలు, PSU లలో ఉద్యోగాలు చేసుకోవచ్చు.
- బీటెక్ తరువాత బిజినెస్, మానేజ్మెంట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే MBA మంచి ఆప్షన్. ఇందుకోసం CAT, MAT, GMAT లాంటి ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. Project Manager, Business Analyst, Operations Manager లాంటి ఉద్యోగా అవకాశాలు ఉంటాయి.
- బీటెక్ తరువాత విదేశాల్లో MS చేయడానికి కూడా మంచి అవకాశం ఉంది. USA, Germany, Canada లాంటి సీట్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఇందుకోసం GRE, TOEFL/IELTS లాంటి ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల ఇంటర్నేషనల్ డిగ్రీ, లక్షల్లో ఆదాయం ఉండే ఉద్యోగ అవకాశాలు.
- బీటెక్ తరువాత PG Diploma కోర్సులు కూడా మంచి ఆప్షన్ గా చెప్పొచ్చు. అందులో Artificial Intelligence (AI), Data Science, Cyber Security, Cloud Computing, Robotics లాంటి అద్భుతమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సివిల్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకి IAS/IPS లాంటి అవకాశాలు ఉన్నాయి.
బీటెక్ తరువాత ముఖ్యమైన ఉద్యోగ అవకాశాలు:
- ప్రైవేట్ కంపెనీ IT & Core Sectors ఉద్యోగాలు. TCS, Infosys, Wipro, Accenture, Cognizant, HCL లాంటి టాప్ కంపెనీలలో జాబ్స్. Software Developer, QA Tester, System Analyst, Support Engineer లాంటి ఉద్యోగాలు చేసుకోవచ్చు.
- కొర్ సెక్టార్స్ లో మంచి జాబ్స్ ఉన్నాయి. L&T, BHEL, GAIL, NTPC వంటి సంస్థల్లో లక్షల ఆదాయం వచ్చే జాబ్స్ చేసుకోవచ్చు. ఇందుకోసం మంచి GATE స్కోర్ ఉంటే PSU లలో స్థిర ఉద్యోగం పొందవచ్చు.
- Public Sector Units లో కూడా అద్భుతమైన జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. మంచి నాలెడ్జ్ ఉంటె అద్భుతమైన ఆదాయం పొందవచ్చు.
- రక్షణ రంగంలో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, DRDO, ISRO, BARC లాంటి పరిశోధనా సంస్థలు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి.
- బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు. IBPS, SBI PO, RRB, SSC JE, SSC CGL లాంటి పరీక్షల ద్వారా ఉద్యోగం, మంచి శాలరీ పొందవచ్చు.